36.2 C
Hyderabad
April 18, 2024 12: 53 PM
Slider విశాఖపట్నం

కానిస్టేబుల్ వ్రాత పరీక్షా కేంద్రాల పరిశీలించిన విశాఖ రేంజ్ డీఐజీ

#vizagrange

విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ వరుసగా రెండో రోజు విజయనగరం జిల్లా లో పర్యటించారు. నిన్న జిల్లాలో ని నెల్లిమర్ల పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన డీఐజీ… ఈ రోజు..విజయనగరం లో ఎస్సీటీఎస్ఐల ఉద్యోగ నియామకాలకు ఈ నెల 19న నిర్వహించే ప్రిలిమినరీ వ్రాత పరీక్ష నిర్వహించే పరీక్షా కేంద్రాలను  విశాఖ రేంజ్ డీఐజీ ఎస్.హరికృష్ణ, సందర్శించి, పరీక్ష కేంద్రాల వద్ద భద్రతను పర్యవేక్షించారు. ,

సీతం , జేఎన్టీయూ, ఎంఆర్ కాలేజ్, శ్రీ చైతన్య, భాష్యం, ఏజీఎల్ కాలేజ్, లెండి, ఎంవీజీఆర్ కాలేజ్ లను డీఐజీ హరికృష్ణ సందర్శించి, పేపర్లను భద్రపరిచే స్ట్రాంగ్ రూంలను పరిశీలించి, సిసి కెమెరాల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఐ ఉద్యోగ నియామకాల కొరకు నిర్వహించే ప్రిలిమినరీ వ్రాత పరీక్షలో ఎటువంటి అవకతవకలు జరగకుండా నిర్వహించేందుకు అన్ని భద్రత చర్యలు చేపట్టాలని డీఐజీ హరికృష్ణ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. కాలేజ్ యాజమాన్యాలు చేపట్టిన చర్యలను డీఐజీ హరికృష్ణకు కళాశాలల అధికారులు, ప్రిన్సిఫాల్స్  వివరించగా, వారికి పలు భద్రత పరమైన సూచనలు డిఐజి హరికృష్ణ చేశారు.ఈ కార్యక్రమంలో విజయనగరం ఇన్ ఛార్జ్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, స్పెషల్ బ్రాంచ్ సిఐ జి.రాంబాబు, విజయనగరం రూరల్ సిఐ టివి తిరుపతిరావు, వన్ టౌన్ సిఐ డా.బి.వెంకటరావు, టూటౌన్ సిఐ సిహెచ్.లక్ష్మణరావు, ఎస్ఐ గణేష్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఉత్త‌మ క్రీడాకారులుగా ఎద‌గాలి : జేసీ వెంక‌ట‌రావు

Satyam NEWS

ఎంతో వైభవంగా చాధరఘాట్ రేణుక ఎల్లమ్మ బోనాల జాతర

Satyam NEWS

ఎన్నారై టీడీపీ నేతల నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment