30.7 C
Hyderabad
April 19, 2024 08: 24 AM
Slider మహబూబ్ నగర్

విద్యార్థులందరికీ డిజిటల్ పాఠాలు అందించాలి

#KollapurSchool

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని అమరగిరి ప్రాథమిక పాఠశాలను జిల్లా సెక్టోరల్ అధికారి నారాయణ నేడు ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశమై  డిజిటల్ పాఠాలకు సంబంధించిన స్కూల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

వాట్స్అప్ గ్రూపులు తయారు చేసుకుని విద్యార్థులను పర్యవేక్షించాలని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకుని హోమ్ రిజిస్టర్లో విద్యార్థుల పేర్లను, ఫోన్ నెంబర్లను, విద్యార్థుల ఇళ్లను సందర్శించిన తేదీ,  విద్యార్థి ఏ పాఠాలు వింటున్నారు, ఏ చానల్లో వస్తున్నాయి అనే విషయాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

విద్యార్థుల, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలను రిజిస్టర్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని తెలిపారు. విద్యార్థులకు ఏమైనా అనుమానాలుంటే ఉపాధ్యాయులు విద్యార్థులకు   ఫోన్ లో గాని నివృత్తి చేయాలని తెలిపారు.

మారుమూల ప్రాంతం లోని  శివ,  పుష్పావతి విద్యార్థుల ఇళ్లకు వెళ్లి డిజిటల్ పాఠాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారులు మంతటి నారాయణ, అహ్మద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్, రామచంద్ర రావు, నాగరాజు, సి ఆర్ పి వెంకటస్వామి పాల్గొన్నారు.

Related posts

గణేష్ నిమజ్జనం కొలనును పరిశీలించిన జోనల్‌ కమీషనర్‌ ఉపేందర్‌రెడ్డి

Satyam NEWS

తిరుచ్చి పై మాడ వీధుల్లో సౌమ్యనాధ స్వామి…

Satyam NEWS

హ్యాపీ ఎండింగ్: కలకలం రేపిన బాలికల అదృశ్యం

Satyam NEWS

Leave a Comment