32.2 C
Hyderabad
March 28, 2024 21: 46 PM
Slider సినిమా

దిల్ రాజు రెండో పెళ్లిలో ఎవరికి తెలియని నిజాలు ఇవి

#Dill Raju Marriage

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు రెండో వివాహం ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లోనూ ప్రేక్షకుల్లోనూ చర్చనీయాంశం అయింది. నిజానికి దిల్ రాజు రెండో వివాహంపై చర్చ గత రెండేళ్లుగా జరుగుతూనే ఉంది. తను నిర్మించిన ఓ చిత్రంలో అల్లు అర్జున్ సరసన నటించిన ఓ తమిళ్ హీరోయిన్ తో దిల్ రాజు సహజీవనం చేస్తున్నాడని ఆఫ్ ది రికార్డ్ అందరూ అనేవాళ్ళు.

అయితే ఇప్పుడు దిల్ రాజు పెళ్లి చేసుకున్నది సదరు హీరోయిన్ కాకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. హీరోయిన్ అయ్యుంటే.. వయసు అంతరం గురించి ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదేమో కానీ..ఇప్పుడు దిల్ రాజు చేసుకున్న తేజస్విని అనే అమ్మాయి.

వయసు పరంగా.. దిల్ రాజు కుమార్తె కంటే చిన్నది కావడం వివాదాస్పదం అవుతోంది. దిల్ రాజుకి..  తను పెళ్లాడిన అమ్మాయికి 20 సంవత్సరాల వ్యత్యాసం ఉందని తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో.. దిల్ రాజు మొదటి భార్య అనిత మరణం సహజమైనదా.. కాదా? అనే సందేహాలు సైతం పెద్ద సంఖ్యలో లేవనెత్తుతున్నారు నెటిజనులు.

ఈ విషయాలు కాసేపు పక్కన పెడితే.. దిల్ రాజు తన రెండో వివాహానికి ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ నిబంధనలను భలే వినియోగం చేసుకున్నాడని కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ‘సెలెబ్రిటీ స్టేటస్’ వచ్చాక.. ఎన్ని అడ్వాంటేజస్ ఉంటాయో… అన్ని డిజడ్వాటేజస్ కూడా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది?

Related posts

రైతాంగ పోరాట చరిత్రలో నిలిచిన గుండ్రాపల్లి

Satyam NEWS

ఎరువుల కోసం రైతు భరోసా కేంద్రాల వద్ద బారులు తీరిన రైతన్న

Satyam NEWS

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే ప్రోత్సాహకాలు

Satyam NEWS

Leave a Comment