వెరైటీ టైటిల్స్‌తో ఆసక్తికరమైన చిత్రాలను తీసి సంచలన విజయాలను సాధించే దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్. సత్యదేవ్, ఇషా రెబ్బా హీరో, హీరోయిన్లుగా ప్రముఖ కథానాయకుడు ‘శ్రీరామ్’, ‘పైసా వసూల్’ ఫేమ్ ముస్కాన్ సేథ్, గణేశ్ వెంకట్రామన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రాగల 24గంటల్లో’. శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ కానూరి నిర్మాత. ‘ఢమరుకం’ శ్రీనివాస్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఆవిష్కరణ విభిన్నంగా జరిగింది. ఫస్ట్ లుక్‌ను, పోస్టర్ నంబర్ 1పోస్టర్ నంబర్ 2 అని రెండు పోస్టర్‌లను విడుదల చేసింది చిత్రయూనిట్. మొదటి పోస్టర్‌ను సి.కల్యాణ్ విడుదల చేయగా, రెండో పోస్టర్‌ను శ్రీనివాస్ రెడ్డి బావ, వ్యాపారవేత్త పులివెందులకు చెందిన దంతులూరి కృష్ణ విడుదల చేశారు.
previous post
next post