40.2 C
Hyderabad
April 19, 2024 15: 15 PM
Slider సంపాదకీయం

షర్మిలకు తెలంగాణలో ప్రతిఘటన ఎందుకు ఎదురుకావడం లేదు?

#YSSharmila1

వై ఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ పై టీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానికతను ప్రశ్నించినా కూడా షర్మిలపై టీఆర్ఎస్ నాయకులు పల్లెత్తు మాట అనలేదు. ఎందుకో… తెలియడం లేదు. ఇదే ప్రశ్న టీఆర్ఎస్ కార్యకర్తల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఆంధ్రా ప్రాంతం వారిని పూర్తిగా వ్యతిరేకించిన కేసీఆర్ కొత్తగా పార్టీ పెట్టబోతున్న షర్మిలను ఎందుకు వ్యతిరేకించడం లేదు?

ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కాకపోవడంతో షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నది కేసీఆరేనా? అనే అనుమానం బలపడుతున్నది. షర్మిల పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటన వెలువడిన వెంటనే ఇదే పుకారు బలంగా వినిపించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తో ఇంకా ఉన్న రెడ్డి కులస్తులను చీలిస్తే తప్ప వచ్చే ఎన్నికలలో తనకు లాభం జరగదని భావించిన కేసీఆర్ ఈ యత్నం చేస్తున్నారని అప్పటిలో పుకార్లు వినిపించాయి.

ఇంకా కాంగ్రెస్ ను వీడని రెడ్డి కులస్తులు

రెడ్డి కులస్తులు కాంగ్రెస్ వీడి బిజెపి వైపు వెళ్లడం లేదు. ఆ పార్టీ ఎంత ప్రయత్నం చేసినా రెడ్లను ఆకర్షించలేకపోవడం కాంగ్రెస్ పార్టీకి వరంగా మారింది. దాంతో వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి మధ్య త్రిముఖ పోటీ నెలకోనే అవకాశం కనిపించింది.

అయితే నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికలలో కింది స్థాయి కాంగ్రెస్ క్యాడర్ తమ పార్టీ గెలిచేది లేదని భావించి ఆఖరు నిమిషంలో బిజెపి అభ్యర్ధులకు అనుకూలంగా పని చేశాయి. దాంతో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. బిజెపి గెలిచింది.

ఇదే నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాలలో రివర్సు జరిగింది. బిజెపి కింది స్థాయి కార్యకర్తలు కాంగ్రెస్ వైపు ఆఖరు నిమిషంలో మొగ్గు చూపి టీఆర్ఎస్ కు చుక్కలు చూపించారు. అందువల్ల వచ్చే ఎన్నికలలో త్రిముఖ పోటీ తనకే ప్రమాదం తెచ్చిపెడుతుందని టీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నదని అనుకుంటున్నారు.

చతుర్ముఖ పోటీకి కదులుతున్న పావులు

ఈ నేపథ్యంలో మరో బలమైన శక్తి రంగంలో ఉంటే చతుర్ముఖ పోటీ జరిగే అవకాశం ఉంటుంది. ఇలా చతుర్ముఖ పోటీ జరిగే సందర్భంలో ఏ రెండు పార్టీలూ కలిసే అవకాశం ఉండదు. అందుకే టీఆర్ఎస్ ప్రోద్బలంతోనే షర్మిల పార్టీ పెడుతున్నారనే వాదనలు బలంగా వినిపించాయి.

అయితే ఈ వాదనలను కొట్టి పారేసిన వారు కూడా ఇప్పుడు పునరాలోచనలో పడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి కనీస స్థాయి ప్రతిఘటన కూడా ఎదురు కాకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రా ప్రాంతం నాయకురాలు వచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ప్రతిఘటన ఎక్కడా ఎదురు కాకపోవడం తెలంగాణ వాదులనే ఆశ్చర్యపరుస్తున్నది.

ఈ నేపథ్యలోనే టీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయి అయోమయంలో ఉన్నాయి. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి షర్మిల బిజెపి వైపు మొగ్గితే తమ పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని టీఆర్ఎస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

కాంగ్రెస్ పార్టీని భూ స్థాపితం చేసేందుకు చేసే ప్రయత్నం ఎక్కడ వికటిస్తుందోనని వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బ కొట్టడంతో బిజెపి బలపడిన సందర్భాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

Related posts

కార్పొరేట్ వైద్యానికి ముఖ్యమంత్రి కెసిఆర్ సహాయం

Satyam NEWS

బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి

Satyam NEWS

కోవిడ్ నిబంధనలు పాటించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదేశం

Satyam NEWS

Leave a Comment