దిశ చట్టాన్ని జాతీయ చట్టంగా రూపొందించాలని తెలంగాణ బీసీ మహిళా జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు ఆలం పల్లి లత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న దిశ చట్టం చాలా కఠిన చట్టమని, తద్వారా ఆ రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై ఎలాంటి లైంగిక, శారీరక, మానసిక దాడులు జరిగినా సత్వరమే శిక్షలు విధించుకునేలా ఆ చట్టం రూపొందించడం జరిగిందని ఆమె అభిప్రాయపడ్డారు.
న్యాయ సేవల్లో ప్రాధాన్యత పెరగాలని మహిళలపట్ల మానవతా దృక్పథం తో వ్యవహరించాలని కోరారు. ఇటీవల కాలం లో మహిళలపట్ల జరుగుతున్న అత్యాచారాలు,హత్యలపట్ల లత ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు కూడా మహిళలపై జరుగుతున్న లైంగిక, శారీరక, మానసిక దాడులపై దృష్టి సారించ వలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.