34.2 C
Hyderabad
April 19, 2024 20: 14 PM
Slider విజయనగరం

నిన్న రాజకుమారి నేడు దీపిక: దిశ యాప్ పై ఎస్పిల ప్రత్యేక శ్రద్ధ

#disaapp

ప్రజలకు దిశ (ఎస్.ఓ.ఎస్.) మొబైల్ యాప్ పట్ల అవగాహన పెరిగిందని, ఆపద సమయాల్లో పోలీసుల సహాయం పొందేందుకు ప్రజలు ముఖ్యంగా మహిళలు ముందుకు వస్తున్నారని ప్రస్తుత విజయనగరం  జిల్లా ఎస్పీ ఎం. దీపిక అన్నారు.

జిల్లా పోలీసుశాఖ ప్రజలకు దిశ (ఎస్.ఓ.ఎస్.) మొబైల్ యాప్ పట్ల అవగాహన కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమాలు, దిశ జాగృతి యాత్ర ఫలితంగా మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు, యువత, విద్యార్ధులకు కూడా దిశ (ఎస్.ఓ.ఎస్.)కు ఫిర్యాదు చేయడంపట్ల అవగాహన పెరిగిందన్నారు.

2021లో దిశ (ఎస్.ఓ.ఎస్.)కు 6,653 కాల్స్ మాత్రమే రాగా, వాటిలో దిశ యాప్ పని తీరును పరిశీలించేందుకుగాను 6,491 కాల్స్ వచ్చాయని, వాటిలో పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతూ వచ్చినవి 170 కాల్స్ అని అన్నారు. ఈ 170 కాల్లో 24 కాల్స్ పై ఎఫ్.ఐ.ఆర్.లు (కేసులు) నమోదు చేయగా, 146 కాల్స్పై పోలీసులు చర్యలు చేపట్టినప్పటికీ ఇరు వర్గాలు రాజీ అయ్యారన్నారు.

అదే విధంగా 2022లో జిల్లా పోలీసుశాఖ చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక డ్రైవ్లు, దిశ జాగృతి యాత్ర ఫలితంగా దిశ (ఎస్.ఓ.ఎస్.)కు 19,740 కాల్స్ వచ్చాయన్నారు. వీటిలో దిశ యాప్ పని తీరును పరిశీలించేందుకుగాను వచ్చినవి 19,273 కాల్స్ అని, పోలీసుల సహాయం, చర్యలు చేపట్టాలని కోరుతూ 467 కాల్స్వ చ్చాయన్నారు.

వీటిలో సమస్యల తీవ్రత, ఫిర్యాదుల ఆధారంగా వివిధ పోలీసు స్టేషనుల్లో సంబంధిత పోలీసు అధికారులు 43 కాల్స్ పై ఎఫ్.ఐ.ఆర్.లు (కేసులు నమోదు చేసారని, మరో 423 కాల్స్ పై పోలీసుశాఖ స్పందించి, తక్షణమే చర్యలు చేపట్టినప్పటికీ ఇరు వర్గాల వారు రాజీ అయ్యారన్నారు. జిల్లాలో దిశ (ఎస్.ఓ.ఎస్.) ఫిర్యాదులను ఏ సమయంలోనైనా స్వీకరించేందుకు ప్రత్యేకంగా పోలీసు కంట్రోల్ రూంలో సిబ్బందిని నియమించామన్నారు.

దిశ (ఎస్.ఓ.ఎస్.) కాల్స్  ను స్వీకరించిన వెంటనే కంట్రోల్ రూం సిబ్బంది సంబంధిత పోలీసు స్టేషను అధికారులను అప్రమత్తం చేయడం, చేపట్టిన చర్యలు గురించి నిరంతం ఒక క్రమంలో ఆరా తీస్తారన్నారు. ఈ ఫిర్యాదులను, స్వీకరించిన దిశ (ఎస్.ఓ.ఎస్.) కాల్స్, చేపట్టిన చర్యలను కంట్రోల్ రూం సిఐ ఈ. నర్సింహమూర్తి పర్యవేక్షించి, ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీకు నివేదిస్తారన్నారు. ఆపద సమయాల్లో పోలీసుల సహాయం పొందేందుకు ప్రజలెవ్వరూ సంకోచించ వద్దని, మహిళల రక్షణ, భద్రత కొరకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన దిశ (ఎస్.ఓ.ఎస్.) ఫిర్యాదు చేసి, పోలీసుల సహాయం పొందాలని ప్రజలకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక పిలుపునిచ్చారు.

ముఖ్యమైన ఫిర్యాదులు ఇవి

ఎస్.కోట మండలంకు చెందిన ఒకామె మార్చి మాసంలో దిశ (ఎస్.ఓ.ఎన్.)కు కాల్ చేసి, తనను అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి వేధిస్తున్నట్లుగా తెలపగా, ఎస్.కోట పోలీసులు తక్షణమే స్పందించి, సంఘటనా స్థలంను సందర్శించి, విచారణ చేసి, మహిళ ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని, అతనిపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టారు.

బొబ్బిలి మండలంకు చెందిన ఒక మహిళ ఆగస్టు మాసంలో దిశ (ఎస్.ఓ.ఎస్.)కు కాల్ చేసి, తనను అదే ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు వేధిస్తున్నారని, శారీకంగా బాధిస్తున్నారని తెలపగా, బొబ్బిలి పట్టణ పోలీసులు తక్షణమే స్పందించి, సంఘటనా స్థలంను సందర్శించి, విచారణ చేపట్టి, బాధ్యుల చర్యలు చేపట్టి, కేసు నమోదు చేసారు.

విజయనగరం పట్టణంకు చెందిన ఒకామె జూన్ మాసంలో దిశ (ఎస్.ఓ.ఎస్.)కు కాల్ చేసి, తన చెల్లెలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసారని, చర్యలు తీసుకోవాలని కోరగా, సదరు విషయమై 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, కిడ్నాప్ గురైన అమ్మాయిని 24గంటల వ్యవధిలోనే ట్రేస్ చేసి, వారి తల్లిదండ్రు లకు అప్పగించి, నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టారు.

Related posts

కరోనా నిరోధానికి శ్రీ చైతన్య రూ.కోటి విరాళం

Satyam NEWS

దివంగత ఎడిటర్ సదాశివశర్మ కుటుంబానికి ఆంధ్రభూమి సిబ్బంది సాయం

Satyam NEWS

పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఓజో ఫౌండేషన్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment