39.2 C
Hyderabad
April 25, 2024 15: 55 PM
Slider ప్రత్యేకం

అర్ద‌రాత్రిళ్లు..అక్క‌డ‌ ఖాకీలు చేస్తున్న ప‌ని అదీ….!

#disha app

అర్ధ‌రాత్రిళ్లు చిమ్మ చీక‌ట్లో అస‌భ్యక‌ర చేష్ట‌లు….!

మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న నేరాల‌పై గట్టి నిఘా..!

ఆయా ప్రాంతాల‌లో విజ‌య‌న‌గ‌రం పోలీసులు కాప‌లా…!

దిశ యాప్ తెలియ‌ని గ్రామీణ ప్రాంతాలలో మ‌హిళా పోలీసులు…!

డీఎస్పీ అనిల్ నేత‌త్వంలో మ‌హిళా సంర‌క్ష‌క పోలీసుల ప‌ని…!

ఎస్పీ దీపికా పాటిల్ అదేశాల‌తో  ఆయా చోట్ల దిశ బీట్స్…!

ఇదీ గ‌డ‌చిన కొద్ది రోజులుగా విజ‌య‌నగరం జిల్లాలో విజ‌య‌న‌గ‌రం స‌బ్ డివిజ‌న్  పోలీసులు చేస్తున్న ప‌ని. ఇటీవలే ఏపీ సీఎం జ‌గ‌న్ నేతృత్వంలో  మహిళ‌ల‌పై జ‌ర‌గుతున్న నేరాల‌ను అరిక‌ట్ట‌డంపై జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో దిశ యాప్ వినియోగంపై  విస్త్ర‌తంగా  ప్ర‌చారంతో పాటు దానిని గ్రామీణ ప్రాంత మ‌హిళ‌లు, యువ‌తులు ఏ విదంగా వినియోగించుకోవాల‌న్న దానిపై అవ‌గాహ‌న క‌ల్పించాలని చెప్పిన ద‌రిమిలా… ఆ దిశగా రాష్ట్ర పోలీస్ శాఖ అడుగులు వేస్తోంది.

ఈ క్ర‌మంలోనే డీజీపీ నుంచీ వ‌చ్చిన ఆదేశాల‌తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పోలీసు శాఖాధిపతులు ప్ర‌త్యేకంగా మీటింగ్ లు నిర్వహించారు.అందులో భాగంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ ఇటీవ‌లే న‌గ‌రంలోని దండు మార‌మ్మ టెంపుల్ లో నేర స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో దిశ యాప్ పై అవ‌గాహ‌న క‌ల్పించాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు కూడ‌.

ఈ క్ర‌మంలోనే విజ‌య‌న‌గ‌రం స‌బ్ డివిజన్ పోలీస్ సూప‌రెంటెండెంట్ అనిల్…త‌న ప‌రిధిలో ఉన్న  వ‌ల్ల‌ర బుల్  ప్లేసెస్ ను ముందుగానే త‌న ఐడీ పార్టీ, స్నైప‌ర్ టీం ,ఎస్.బీ  సిబ్బంది తో గుర్తంచారు. అందులో భాగంగా రెండు రోజుల క్రితం గుర్ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఆయా ప్రాంతాల‌ను రూర‌ల్ సీఐ మంగ‌వేణి,  గుర్ల ఎస్ఐ శీరిష‌ల‌తో అర్ద‌రాత్రి  త‌నిఖీలు చేసి ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌ను అలెర్ట్ చేసారు.ప్ర‌త్యేకించి   టార్చ్ లైట్లు, విజిల్స్ వేసుకుని మ‌రీ ముళ్ల పొద‌లు, చెట్ల మ‌ధ్య తిరిగి..కొన్ని అనుమానిత ప్రదేశాల‌ను గుర్తించారు.

దీంతో పాటు   మహిళల‌కు భ‌ద్ర‌త క‌ల్పించేందుకు ఇటీవ‌లే కొన్ని కేసులు నమోదైన ప్రాంతాల‌ను.. గుర్తించిన విజ‌య‌న‌గ‌రం పోలీసులు.. ప్ర‌త్యేకింది దిశ బీట్స్ ను అదీ మ‌హిళా సంర‌క్ష‌క పోలీసుల‌తో  పెట్టి గట్టి నిఘా పెట్టారు. మహిళల భద్రతకై  ఒక దిశా బీట్, అదే విదంగా మహిళలు బెదిరింపున‌కు గురైనప్పుడు  దిశ యాప్ లో ఎస్ఓఎస్ ఆప‌రేట్ తెలియ‌ని,రాని ప‌క్షంలో  ఈ దిశ బీట్స్  బాధితుల‌కు ఉప‌యోగ ప‌డే విధంగా  పోలీసులు ఏర్పాటు చేసారు..

అలాగే ఎస్పీ దీపికా ఆదేశాలతో  విజ‌య‌న‌గ‌రం డీఎస్పీ అనిల్.. అత్య‌ధికంగా జ‌రిగే నేరాలు, అలాగే వీధి  దీపాలు లేకుండా ఉండే ప్రాంతాల‌ను  గుర్తించారు. ఈ మేర‌కు   త‌న సిబ్బంది తో ఆయా ప్రాంతాల‌లో గ‌త అర్ధ‌రాత్రి  తిరిగి…అలెర్ట్ చేసారు. ఈ సందర్భంగా దిశ బీట్స్ పై స‌త్యం న్యూస్.నెట్ తో డీఎస్పీ అనిల్ త‌న కార్యాల‌యంలో మాట్లాడారు. 

దిశ యాప్  ద్వారా ప‌లు ప్రాంతాల‌లో మ‌హిళ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నామ‌న్నారు. దాంతో  శాఖా సిబ్బంది అర్ధ‌రాత్రిళ్లు…స‌మ‌స్యాత్మ‌క‌, అత్య‌ధిక నేరాలు జ‌రిగేందుకు అవ‌కాశం  ఉన్న ప్రాంతాల‌లో  టార్చ్ లైట్లు వేసుకుని మరీ గ‌స్తీ చేప‌ట్టి  అక్క‌డి స్థానికుల‌ను అలెర్ట్ చేస్తున్నామ‌న్నారు. దిశ యాప్  వినియోగంలో భాగంగా డీజీ…టార్చ్ లైట్ల ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నార‌న్నారు.

Related posts

సీఎం కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన కలెక్టర్

Satyam NEWS

ప్రాణాంతక వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించడం అవసరం

Satyam NEWS

సస్టెయిన్ కార్ట్ ప్రారంభించిన అక్కినేని నాగార్జున

Satyam NEWS

Leave a Comment