28.7 C
Hyderabad
April 24, 2024 06: 01 AM
Slider ప్రత్యేకం

దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం: సుప్రీంకోర్టుకు నివేదిక

#supremecourtofindia

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ సామూహిక అత్యాచారం తర్వాత జరిగిన నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని విచారణ సంఘం నిర్ధారించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా హైదరాబాద్‌ పోలీసులపై ప్రశంసల జల్లు కురిపించారు. 2019 నవంబర్ లో హైదరాబాద్‌లో 27 ఏళ్ల ఒక వెటర్నరీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరిగింది.

ఆ తర్వాత ఆమెను పాశవికంగా హత్య చేశారు. హైదరాబాద్ విమానాశ్రయం సమీపంలో షాద్‌నగర్‌ రోడ్డులోని ఓ వంతెన కింద కాలిపోయిన స్థితిలో ఆమె మృతదేహం లభ్యమైంది. దీనిపై దేశవ్యాప్తంగా సంచలనం కలిగింది. దిశ పేరుతో వ్యవహరించిన ఆమె పై జరిగిన అత్యాచారాన్ని అందరూ ఖండించారు. సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో హైదరాబాద్ పోలీసులు నలుగురు నిందితులు  మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ మరియు జొల్లు నవీన్‌లను అరెస్టు చేశారు.

అత్యాచారం జరిగిన చోటే ఎన్ కౌంటర్

ఈ నలుగురు నిందితులను  హైదరాబాద్ ఎన్‌హెచ్-44లో ఎన్ కౌంటర్ చేశారు. దిశ పై అత్యాచారం చేసి హత్య చేసిన అదే రహదారిపై వంతెన కింద ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఫిర్యాదులు రావడంతో సిర్పుర్కర్ విచారణ కమిషన్ నియమించారు. విచారణ కమిషన్ తన దర్యాప్తు నివేదికను సుప్రీంకోర్టులో సమర్పించింది. కేసు దర్యాప్తు నివేదికను తెలంగాణ హైకోర్టుకు పంపాలని ఆదేశిస్తూనే, బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కోరింది.

నివేదికను సీల్డ్ కవర్‌లో ఉంచాలని సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ చేసిన విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ ఎన్వీ రామణ, న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఇది ఎన్‌కౌంటర్‌కు సంబంధించినదని, ఇందులో దాగడానికి ఏమీ లేదని ధర్మాసనం పేర్కొంది. కమిషన్ ఒకరిని దోషిగా నిర్ధారించింది. ‘‘ఈ నివేదికను తెలంగాణ హైకోర్టుకు పంపుతున్నాము. మేము ఈ కేసును పర్యవేక్షించలేము. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది హైకోర్టు నిర్ధారిస్తుంది’’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ విచారణ కమిషన్ కొన్ని సిఫార్సులు చేసింది. దీంతో పాటు నివేదిక కాపీని ఇరుపక్షాలకు అందించాలని కమిషన్‌ను కోర్టు ఆదేశించింది.

Related posts

ములుగు లోని దేవుని గుట్ట ఆలయం అద్భుతం

Satyam NEWS

మహిళా కార్మికుల్ని వేధిస్తున్న సూపర్ వైజర్ కు దేహశుద్ధి

Satyam NEWS

నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్

Bhavani

Leave a Comment