38.2 C
Hyderabad
April 25, 2024 11: 09 AM
Slider ముఖ్యంశాలు

“దిశ” ఎస్.ఓ.ఎస్ సహకారం…బాడంగి ఎస్ఐకు పురస్కారం

#jagan

ఓ సాధారణ ఎస్ఐ లైఫ్ అచీవ్ మెంట్ అవార్డు అందు కున్నారు… అదీ సీఎం జగన్ చేతుల మీదుగా… అంతే నా…లక్ష నగదు ను అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ప్రొహిబిషనరీ ఎస్ఐగా ఉంటూ ఎస్ఐ ర్యాంక్ తో విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా సమక్షంలో బాడంగి ఎస్ఐ గా పని చేస్తున్న జయంతి… రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ను అందుకున్నారు.

జిల్లా పూసపాటి రేగ పీఎస్ లో ఎస్ఐ గా పని చేసిన సమయంలో దిశా ఎస్ఓఎస్ కు కాల్ కు తక్షణమే స్పందించారు. ఆ అర్ధ రాత్రి సమయంలో చౌడువాడ గ్రామం కు చేరుకొని, పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని సకాలంలో ఆసుపత్రికి తరలించారు.అంతే నా..ఆ బాధితురాలి ప్రాణాలు కాపాడుట లోను,అటు నిందితుడిని 24 గంటల వ్యవధిలో అరెస్టు చేయుటలో క్రియాశీలకంగా పని చేసిన ఎస్ఐ రావాడ జయంతి వై.ఎస్.ఆర్.లైఫ్ టైం అవార్డు లభించింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ చేతుల మీదుగా ప్రస్తుతం బాడంగి పోలీసు స్టేషనులో ఎస్ఐగా పని చేస్తున్న ఆర్.జయంతి అందుకున్నారు. ఈ అవార్డు లో భాగంగా లక్ష నగదు, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్, వైఎస్ విజయలక్ష్మి మరియు ఇతర అధికారులు, పాల్గొన్నారు.

Related posts

పోలవరం  ప్రాజెక్టు నిర్మాణం 2022 నాటికి పూర్తి

Satyam NEWS

ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ ధ్యేయంగా పని చేయాలి: మంత్రి తానేటి వనిత

Satyam NEWS

డ్రైంకెన్ డ్రైవ్ లో పట్టుపడ్డ ముగ్గురు యువకులు హల్ చల్

Satyam NEWS

Leave a Comment