36.2 C
Hyderabad
April 25, 2024 20: 57 PM
Slider విజయనగరం

ఎస్.కోట‌,ఎల్.కోట పోలీస్ స్టేష‌న్ల ప‌రిదిల‌లో దిశ జాగృతి యాత్ర‌…..!

ఎవ్వ‌రివ‌ద్ద చూసిన ఏండ్రైడ్ ఫోన్. ప్ర‌ప‌చం మొత్తం మ‌న అర చేతిలోనే అదీ స్మార్ట్ ఫోన్ లోనే క‌నిపిస్తోంది. అంతే వేగంగా నేరాలు జ‌రిగేందుకు అవ‌కాశాలు ఏర్ప‌డుతున్నాయి. అయితే ప్ర‌పంచ ఎంత‌శ‌ర‌వేగంగా అభివృద్ది చెందుతున్న‌ప్ప‌టికీ స‌మాజం చెడు త్రోవ‌ల్లో వెళ్ల కుండా ఉండేందుకు ఎవ‌రికి వారు త‌గిన జాగ్ర‌త్త‌లు…పాటించాల్సిందే. అదే చెబుతోంది…జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన దిశ యాప్. గ‌డ‌చిన వారం రోజుల నుంచీ అటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు జిల్లా వ్యాప్తంగా దిశ జాగృతి యాత్ర తిరుగుతోంది. తాజాగా ఆ యాత్ర రాష్ట్రంలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్ లోప్ర‌వేశించింది.ఈ మేర‌కు ఎస్.కోట‌, ఎల్.కోట ల‌లో హైస్కూళ్ విద్యార్ధినీల‌తో మ‌మేక‌మైంది.ఈ మేర‌కు ఎస్.కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను దిశ జాగృతి బృందం సందర్శించింది.అక్క‌డి విద్యార్ధినీల‌తో మ‌మేక‌మైంది. యాత్ ద్వారా..అందునా ఎల్సీడీ ద్వారా విద్యార్ధినీల‌లో అవ‌గాహ‌న క‌ల్పించే నిమిత్తం ల‌ఘు చిత్రాల‌ను ప్రద‌ర్శించారు.అలాగే ప్ర‌ముఖ గ‌జ‌ల్ కారునితో పాట‌ల రూపంలో వారికి చైత‌న్యం క‌ల్పించింది…దిశ జాగృతి యాత్ర‌. ఈ సంద‌ర్బంగా ప్ర‌తీ ఒక్క‌రితో సత్ప్రవర్తనతో మెలిగాల‌న్నారు.అలాగే ఉన్నత లక్ష్యాలను సాధించాలని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలు, వ్యామోహాలకు లొంగ‌వ‌ద్ద‌ని కోరారు.అలాగే మహిళల రక్షణకు ప్రత్యేకంగా చట్టాలు రూపొందించ బ‌డ్డాయి..అందులో భాగమే ధిశ చ‌ట్ట‌మని అలాగే దిశా యాప్ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. తాము ఎదుర్కొంటున్న వేధింపులపై విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు దిశా ఫిర్యాదు బాక్సులను పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం సబ్ డివిజన్ ఇన్ చార్జ్ అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి, ఎస్.కోట సిఐ సింహాద్రి నాయుడు, ఎస్.కోట ఎస్.ఐ లు తారకేశ్వర రావు, లోవ రాజు,ఎల్..కోట ఎస్.ఐ కె.లక్ష్మణ రావు, వల్లంపూడి ఎస్.ఐ రాజేశ్, గాయకులు గజల్ గాంధీ, రేలారే రేలా జానకి రామ్, పాఠశాల ఉపాద్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

గొర్రెలకాపరిని కొట్టిచంపిన అగంతకులు

Satyam NEWS

కరోనా పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

గుడ్ కాజ్: సోమశిల ప్రభుత్వ పాఠశాలకు దాతల చేయూత

Satyam NEWS

Leave a Comment