33.2 C
Hyderabad
April 26, 2024 01: 27 AM
Slider విశాఖపట్నం

ఆంధ్రా యూనివర్శిటీయా? లేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా?

#Andhra University

ఆంధ్రా యూనివర్సిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చిన ఉపకులపతి ఆచార్య పి.వి.జి.డి.ప్రసాద్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని ఏపి టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్ డిమాండ్ చేశారు.

రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశ్యం ఉంటే ఉపకులపతి పదవికి ఆయన తక్షణమే రాజీనామా చేయాలని ప్రణవ్ గోపాల్ సూచించారు. పవిత్రమైన విద్యాలయం అయిన ఆంధ్రా యూనివర్శిటీ పేరు ప్రఖ్యాతులు నాశనం చేయవద్దని ఆయన కోరారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కోవిడ్ వ్యాప్తికి కారణమవుతున్న ఆచార్య ప్రసాద్ రెడ్డి పై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు.

జివిఎంసి కార్పొరేషన్ ఎన్నికల్లో రెడ్డి కుల సమావేశంలో పాల్గొని ఆచార్య ప్రసాద్ రెడ్డి ఆంధ్రా యూనివర్శిటీ పరువు తీశారు. ఆంధ్రా యూనివర్శిటీ పేరు ప్రతిష్టలను తన రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకుంటున్నారు.

ఆంధ్రా యూనివర్శిటీ లో కోవిడ్ కారణంగా చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి ఖాళీలేని మీకు రాజకీయ కార్యకలాపాలకు తీరిక ఎలా వచ్చింది? అంటూ ఆయన ప్రశ్నించారు. ఆంధ్రా యూనివర్శిటీ లో కోవిడ్ కారణంగా చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని ఆయన కోరారు.

దళిత ఉపకులపతులపై విచారణ కమిటీలు వేసే జగన్ రెడ్డి రెడ్డి కులస్తులు ఉపకులపతులైతే అందలాలు ఎక్కిస్తున్నారని ఆయన అన్నారు.

మూడవ పట్టణ పోలీసు స్టేషన్ లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్ధి యువజన జెఎసి రాష్ట్ర చైర్మన్ ఆరేటి మహేష్ ,విశాఖ పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు యస్.రతన్ కాంత్ , ప్రధాన కార్యదర్శి జోష్ యాదవ్ ,గాజువాక అసెంబ్లీ అధ్యక్షుడు రవి కుమార్,యస్.కోట అసెంబ్లీ అధ్యక్షుడు ఈశ్వర్ , విశాఖ పశ్చిమ అధ్యక్షుడు వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు పోరాటం ఆగదు

Satyam NEWS

సంఘీభావ నిధికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

Satyam NEWS

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment