33.2 C
Hyderabad
April 26, 2024 02: 48 AM
Slider ముఖ్యంశాలు

డామిట్ కథ అడ్డం తిరిగింది: ఏపి ఉద్యోగులలో చీలిక

#Venkatramireddy

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిలాగా వ్యవహరించిన ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కి తన సహచరుల నుంచి గట్టి దెబ్బ తగిలింది. రాజధాని ని విశాఖ పట్నంకు తరలించడం నాటి నుంచి పంచాయితీరాజ్ ఎన్నికల వరకూ ఆయన ఏకపక్ష వైఖరితో విసిగిపోయిన సాటి ఉద్యోగ సంఘాల నాయకులు తిరుగుబాటు చేయడంతో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు రెండుగా చీలిపోయినట్లయింది.

ఏపీ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పై అమరావతి ఉద్యోగుల జేఏసీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వెంకట్రామి రెడ్డి వైఖరితో ఉద్యోగులు పలుచన అయిపోయారని, అమరావతి ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తిని కింద స్థాయి ఉద్యోగులతో సంబంధాలు లేవని, వెంకట్రామిరెడ్డి వైఖరి పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం అని బొప్పరాజు అన్నారు.

వెంకట్రామిరెడ్డి వైఖరితో ఉద్యోగులకు భరించలేని స్థితిలోకి వేల్లిపోయారని, అందుకే వెంకట్రామిరెడ్డి పై, వివిధ ఉద్యోగుల సంఘాలు ఆవేదన చెందుతున్నాయని అన్నారు. వెంకట్రామి రెడ్డి , రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పై చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యాయి.

ఏకంగా సుప్రీం కోర్టు కూడా, ఎన్నికల పిటీషన్ గురించి విచారణ సమయంలో, ఉద్యోగులు వేసిన పిటీషన్ గురించి, న్యాయవాది కలుగ చేసుకోగా జడ్జి తీవ్రంగా స్పందించారు. మీ ఉద్యోగుల ఓవర్ ఆక్షన్ చూస్తున్నాం, మీరు ఏకంగా ఎన్నికల కమీషనర్ పైనే వ్యాఖ్యలు చేస్తారా, మాట్లాడకండి అంటూ ఘాటుగా స్పందించింది సుప్రీం కోర్టు.

వెంకట్రామి రెడ్డి చేసిన ఓవర్ ఆక్షన్ కి, ఆయన చరిత్ర తవ్విన తెలుగుదేశం పార్టీ, ఆయన భార్య ముషీరాబాద్ లో 2014లో ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేద్దామని అనుకుని, ప్రచారం చేసిన ఫోటోలు, వీడియోలు బయట పెట్టింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు వెంకట్రామిరెడ్డిపై తిరుగుబాటు చేశాయి.

Related posts

మున్నూరుకాపుల అభ్యున్నతికి కార్పోరేషన్‌ ఏర్పాటు చేయాలి

Satyam NEWS

మహిళలకు కొత్త స్కీమ్‌.. ‘సమ్మాన్‌ బచత్‌ పత్ర’

Bhavani

మల్లయోధుడి తెరచాటు ప్రేమ కథ

Satyam NEWS

Leave a Comment