28.7 C
Hyderabad
April 20, 2024 04: 33 AM
Slider నిజామాబాద్

చనిపోయిన వ్యక్తికి ట్రీట్ మెంట్ చేస్తున్నారని బంధువుల ఆందోళన

#hospital

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఠాగూర్ సినిమాను తలపించేలా హైడ్రామా చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పురుగుల మందు తాగితే ఆస్పత్రికి తీసుకురాగా పేషంట్ చనిపోయినా చికిత్స చేసి డబ్బులు తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గాంధారి మండలం తిప్పారం గ్రామానికి చెందిన చాకలి సాయిలు గురువారం రాత్రి అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసాడు. దాంతో రాత్రి 2 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేర్చుకున్నం వైద్యులు చికిత్స కొనసాగించారు. అయితే ఆ రోజు సాయంత్రం నుంచి పేషంట్ వద్దకు ఎవరిని పంపించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ రోజు రాత్రి సాయిలు చనిపోయాడని వైద్యులు చెప్పారని, అంతకుముందే చనిపోయి ఉంటాడని, అయినా వైద్యులు చెప్పలేదని కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

చనిపోయాడని చెప్పలేదు

చాకలి సాయిలును ఆస్పత్రికి తెచ్చినప్పుడే బ్రతికే అవకాశం లేదని, తమతో కాదని వెంటనే చెప్పినా కుటుంబ సభ్యుల రిక్వెస్ట్ మేరకు ఆస్పత్రిలో చేర్చుకున్నామని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. పేషంట్ పరిస్థితి ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగిందని పేర్కొన్నారు. బాడీలో విషమయమైన రక్తం శుద్ధి కోసం డయాలసిస్ కూడా చేసామని, చివరి ప్రయత్నంగా సీపీఆర్ కూడా చేశామన్నారు. దాంతో కొద్దిగా రికవరీ అయినా మళ్ళీ అదే స్టేజికి వెళ్లిపోవడంతో వెంటిలేటర్ మీద చికిత్స అందించామన్నారు. పేషంట్ పరిస్థితి స్టేబుల్ గా లేదని చెప్పామని, చనిపోయాడని తాము చెప్పలేదని వైద్యులు స్పష్టం చేశారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

Satyam NEWS

కేసీఆర్ భజనపరులు ఉద్యమ సమయంలో ఎక్కడున్నారు?

Satyam NEWS

సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు సన్మానం.

Satyam NEWS

Leave a Comment