పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరుకుని పతకాన్ని ముద్దాడుతుందనుకున్న రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు భారీ షాక్ తగిలింది. అధిక బరువు కారణంగా ఫైనల్‌కు ముందే ఆమెపై అనర్హత వేటును విధించారు ఒలింపిక్స్ నిర్వాహకులు. 50 కేజీల విభాగంలో వినేశ్ ఫోగట్ నిర్ణీత బరువు పెరిగారు. ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు పెరగడంతో అనర్హత వేటు పడింది. ఈ మేరకు పారిస్ ఒలింపిక్ నిర్వాహకులు ప్రకటించారు. వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటంతో క్రీడాభిమానులు షాక్‌నకు గురయ్యారు. బంగారు పతకానికి అడుగుదూరంలో ఉండగా ఇలా జరిగిందని బాధ పడుతున్నారు.
previous post