28.7 C
Hyderabad
April 20, 2024 07: 46 AM
Slider విజయనగరం

పోలీసు త్యాగాల వలనే సమాజంలో స్వేచ్ఛగా జీవిస్తున్నాం

#suryakumariias

పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా  దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో ఏడాది అమరులైన 377 మంది పోలీసుల వివరాలతో కూడిన పుస్తకాన్ని విజయనగరం జిల్లా కలెక్టరు ఎ.సూర్యకుమారి, జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆవిష్కరించారు. విధి నిర్వహణలోను, తీవ్రవాదుల దాడుల్లో మృతి చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది పేర్లును ఒఎస్డీ ఎన్. సూర్యచంద్రరావు చదివి వినిపించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టరు ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ  పోలీసు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి తాను కట్టుబడి ఉన్నాని, జిల్లా ఎస్పీ సలహా మేరకు ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు పోలీసులందరికీ వర్తించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తే, వాటిని అమలు చేసేందుకు తప్పకుండా చర్యలు చేపడతామని జిల్లా కలెక్టరు అన్నారు.

సమాజంలో మనతోపాటు ఉంటూ అంతర్గత భద్రతకు విఘాతం కలిగిస్తున్న అసాంఘిక శక్తుల భరతం పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా పోలీసుశాఖ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు ఎ.సూర్యకుమారి అన్నారు.జిల్లా ఎస్పీ ఎం.దీపికి మాట్లాడుతూ జిల్లాలో ఎంతో ధైర్య, సాహసాలతో మావోయిస్టుల చర్యలను ఎదుర్కొంటూ విధులు నిర్వహించి, ఐదుగురు పోలీసులు అమరులయ్యారన్నారు. వారి త్యాగాల వలన ప్రస్తుతం మన జిల్లాలో పూర్తి స్థాయిలో మావోయిజం నిర్మూలన జరుగుతుందన్నారు.

కరోనా వ్యాధి తీవ్రంగా ప్రబలే సమయంలో కూడా పోలీసులు ఫ్రంట్ లైను వారియర్స్ గా ముందు వరుసలో నిలబడి, విధులు నిర్వహించి, కరోనా నుండి ప్రజల ప్రాణాలు కాపాడే క్రమంలో, విధులు నిర్వహిస్తూ, కరోనాబారిన పడి, 10మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారన్నారు. కోవిడ్ విధులలో అమరులైన పోలీసు కుటుంబాల సభ్యులకు ప్రభుత్వం తరుపున 10 లక్షల చెక్ లను అందజేస్తున్నామన్నారు.  పోలీసుల పని ఒత్తిడిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఐ స్థాయి వరకు వీక్లీ ఆఫ్ ను కూడా అమలు చేస్తుందని, ఇకపై జిల్లాలో సక్రమంగా వీక్లీ ఆఫ్ అమలు చేసే విధంగా చర్యలు చేపడుతామని జిల్లా ఎస్పీ అన్నారు.

అమర వీరులకు ఘన నివాళి

అనంతరం, అమరులైన పోలీసులను స్మరించుకొంటూ, అమర వీరుల స్మృతి స్థూపం వద్ద పుష్ప గుచ్ఛాలను వుంచిజిల్లా కలెక్టరు ఎ. సూర్యకుమారి, జిల్లా ఎస్పీ ఎం.దీపికల‌తో పాటు విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాస రావు, ఎమ్మెల్సీలు పివివి సూర్యనారాయణ రాజు, పి.రఘువర్మ, అదనపు సెషన్స్ న్యాయమూర్తి జె. శ్రీనివాసరావు, ఎస్ఈబి అదనపు ఎస్పీ ఎన్.శ్రీదేవీరావు, అదనపు ఎస్పీ ఎన్. సత్యన్నారాయణ రావు, ఒఎస్డీ ఎన్.సూర్యచంద్రరావు,విజయనగరం డిఎస్పీ అనిల్ పులిపాటి, పార్వతీపురం డిఎస్పీ ఎ.సుభాష్, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్. మోహనరావు, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, దిశ మహిళా పిఎస్ డిఎస్పీ టి.త్రినాథ్, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, డిపిఓ ఎఓ వెంకట రమణ, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు మనోరంజనీ గాంధీ, విశాలాక్షి, షేక్ బాబీ జాన్, ఎస్. రాజు, ప్రమీల, వారి బంధువులు, సిఐలు, ఆర్ ఐలు ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

రిజర్వు ఇన్స్ పెక్టరు ఈశ్వర రావు ఆధ్వర్యంలో పోలీసులు వరేడ్ నిర్వహించి, అమర వీరులకు తుపాకుల విన్యాసంతో మనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులకు మరియు చత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల దాడిలో మృతి చెందిన గాజులరేగకు చెందిన రౌతు జగదీష్ కుటుంబ సభ్యులకు జ్ఞాపికలను, పండ్లు, స్వీట్స్, నగదును జిల్లా కలెక్టరు ఎ.సూర్యకుమారి , జిల్లా ఎస్పీ ఎం.దీపిక చేతుల మీదుగా అందజేసారు.ఈ కార్యక్రమానికి డిసిఆర్ బి సిఐ బి. వెంకటరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

వినాయకుడికి ప్రత్యేక పూజ చేసిన మాజీ మంత్రి కృష్ణయాదవ్

Satyam NEWS

Как читать графики акций: Как читать графики криптовалют РУКОВОДСТВО 2021 ️ БЕСПЛАТНО Кофе с крипто

Bhavani

అవినీతి సీఎంల పై సర్వే చేస్తే కేసీఆర్‌దే మొదటి స్థానం

Satyam NEWS

Leave a Comment