36.2 C
Hyderabad
April 24, 2024 19: 34 PM
Slider వరంగల్

జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలి

#scienceexhibition

జిల్లా స్థాయి సైన్స్ గణిత మరియు పర్యావరణ ఎగ్జిబిషన్ ఇన్ స్పైర్ -2022 ప్రదర్శనలు 7,8,9 తేదీల్లో ములుగులో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పాణిని తెలిపారు. మంగళవారం జీవంతరావుపల్లి లోని ఆదర్శ పాఠశాలలో జరిగిన సన్నాహాక సమావేశంలో డీఈవో మాట్లాడుతూ ప్రదర్శనకు సర్వం సిద్ధం చేశామని చెప్పారు. దీనికి జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల నుండి విధిగా రెండు ప్రాజెక్టులు తీసుకురావాలని, ఈ అవకాశాన్ని జిల్లాలోని నీ యాజమాన్య పాఠశాలలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన ప్రధాన అంశం టెక్నాలజీ, బొమ్మలు, ఉప అంశాలు ఇన్ఫర్మేషన్, కమ్యూనిటీ టెక్నాల జీలో పురోగతి, ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్, ఆరోగ్యం, పరి శుభ్రత, రవాణా, ఆవిష్కరణ, పర్యావరణ ఆందోళనలు, ప్రస్తుత ఆవిష్కరణతో చారిత్రక అభివృద్ధి మనకోసం గణిత అంశాలుంటాయని తెలిపారు. పూర్తి వివరాలకు కార్యక్రమ సమన్వయ కర్త జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ 9912342270 నెంబరులో సంప్రదించాలని కోరారు.

ప్రదర్శనలకు పాఠశాలలో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు, ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులకు మూడు రోజుల పాటు భోజన, వసతి, వైద్య, రవాణా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మూడు రోజులు రాత్రి బసచేసే విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా వ్యక్తిగత బెడ్ షీట్స్ తెచ్చుకోవాలని సూచించారు. ప్రదర్శనలను తిలకించేందుకు వచ్చే వారికి తేదీల వారీగా కేటాయించినట్లు 7న ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాలలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, 8న తాడువాయి, ఏటూరు నాగారం, మంగపేట, కన్నాయిగూడెం మరియు 9వ తేదీ ఉదయం వాజేడు , వెంకటాపురం మండలాల పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనను తిలకించాలని తెలిపారు.

దూర ప్రాంతాల నుండి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనడానికి వచ్చే విద్యార్థుల రవాణా సౌకర్యం కోసం ములుగు బస్ స్టాండ్ నుండి జీవంతరావుపల్లి ఆదర్శ పాఠశాల వరకు ప్రైవేటు పాఠశాలల బస్సులు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ప్రైవేటు యాజమాన్య పాఠశాలల బస్సులు అందుబాటులో ఉంటాయని వాటి వివరాల కోసం పిఈటి నాగేందర్ ని 9849467078 నెంబర్లో సంప్రదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కోఆర్డినేటర్లు బద్దం సుదర్శన్ రెడ్డి, సాంబయ్య, రమాదేవి, రాజు, డిసిఇబి కార్యదర్శి ఎన్నం విజయమ్మ, స్థానిక ఎంఈఓలు శ్రీనివాసులు, రాజేష్, దివాకర్, సురేందర్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శోభారాణి, అన్ని మండలాల ఎంఈఓ లు, ట్రస్మా ములుగు జిల్లా అధ్యక్షులు పోశాల వీరమల్లు, ప్రధాన కార్యదర్శి కందాల రమేష్, సురేందర్ ,ఆఫీస్ వివిధ కమిటీల కన్వీనర్లు సభ్యులు పాల్గొన్నారు.

Related posts

అరుదైన శస్త్ర చికిత్స చేసి 4కిలోల కణితి తొలగించిన డాక్టర్ శివప్రసాద్

Satyam NEWS

అజ్ఞాతం వీడిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్

Sub Editor

అకస్మాత్తుగా ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పయనం

Satyam NEWS

Leave a Comment