39.2 C
Hyderabad
March 29, 2024 17: 07 PM
Slider సంపాదకీయం

జిల్లా అధ్యక్ష పదవి మాకొద్దు బాబూ

#YSJaganMohanReddy

పార్టీ పై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయం తీసుకుని పార్టీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రయత్నించిన వైసీపీ నాయకత్వానికి కొత్త సవాళ్లు ఎదురైనట్లు తెలిసింది. అందులో ముఖ్యంగా జిల్లా పార్టీ అధ్యక్ష పదవులు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లా పార్టీ అధ్యక్ష పదవి అంటే అది కేవలం నామ్ కె వాస్తే అనే అభిప్రాయం బలంగా ఉండిపోయింది. జిల్లా అధ్యక్షుడు అంటే ఎవరూ పట్టించుకునే పరిస్థితే ఉండదు. జిల్లాకు ఒక మంత్రి, ఇన్ చార్జి మంత్రి ఉంటున్నాడు. అధికారులు వారి మాటే ఉంటారు. ముగ్గురో నలుగురో సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

అందువల్ల జిల్లా అధ్యక్షుడికి ఏ మాత్రం గౌరవం దక్కే అవకాశం లేదు. పైగా పనులు కూడా ఏవీ అయ్యే పరిస్థితి ఉండదు. అందుకే ఆ  పదవి తీసుకోవడానికి చాలా మంది ఇష్ట పడలేదు. మూడు నాలుగు జిల్లాల పార్టీ అధ్యక్షులు స్వచ్ఛందంగా పదవులు వదులుకున్నారు. తాము ఈ భారం మోయలేమని పదవుల నుంచి నాయకులు తప్పుకోవడమే వైసీపీ అగ్రనాయకులను ఆశ్చర్యానికి గురి చేసింది.

అధికారంలో ఉన్న పార్టీ నుంచి పదవులు ఇస్తామంటే ఎవరైనా ఎగిరి గంతేయాలి కానీ ఇలా జరుగుతున్నదేమిటనే సంశయంలో పార్టీ అగ్ర నాయకులు ఉన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకుంటే రాబోయేది ఎన్నికల కాలం ఓడిపోతే ఓటమి తమపై రుద్దుతారని కూడా చాలా మంది జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రాలేదని అంటున్నారు.

అభ్యర్ధుల ఎంపికలో సిఫార్సు చేయడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయని, పార్టీనే సర్వేలు చేయించడం, పైగా సలహాదారుడి స్థానంలో ఉన్న ఐప్యాక్ వారే అభ్యర్ధుల్ని సూచించడం లాంటి కారణాలవల్ల పార్టీ అభ్యర్ధుల ఎంపికలో కనీసం జిల్లా అధ్యక్షుడి అభిప్రాయం కూడా తీసుకునే అవకాశం పార్టీలో లేకపోవడం వల్ల కూడా ఆ పదవికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఆ పోస్టులను భర్తీ చేయడానికి వైసీపీ అగ్రనాయకులు ఎంతో కసరత్తు చేయాల్సి వచ్చిందని అంటున్నారు.

ఇన్ని కష్టాల మధ్య మొత్తం 26 జిల్లాలకు వైసీపీ అధ్యక్షులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్, మాజీ ఎమ్మెల్యేలను ఎంపిక చేసి జిల్లాలకు పార్టీ అధక్షులుగా బాధ్యతలు అప్పగించారు. వివిధ జిల్లాల అధ్యక్షులు తప్పుకున్న వేళ వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాకు పరీక్షిత్‌ రాజును అధ్యక్షుడిగా నియమించారు. విశాఖ బాధ్యతలు పంచకర్ల రమేష్‌కు అప్పగించారు.

గుంటూరును డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు, ప్రకాశంను జంకె వెంకట్‌రెడ్డికి, కర్నూలును బీవై రామయ్యకు, అనంతపురం జిల్లాలనను పైలా నరసింహయ్యకు, చిత్తూరు జిల్లాను మంత్రి నారాయణ స్వామికి, తిరుపతిని నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డికి అప్పగించారు. కుప్పం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ భరత్‌ను చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా తప్పించారు. అక్కడ మంత్రి నారాయణ స్వామి తప్పుకున్నారు. మాజీ మంత్రి పుష్పశ్రీవాణి, అవంతి శ్రీనివాస్‌, సుచరిత, బుర్రా భాస్కరరెడ్డిని జిల్లా బాధ్యతల నుంచి తప్పించారు.

Related posts

మెమో ఎఫెక్ట్:ఇద్దరు ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్

Satyam NEWS

నోటికి మాస్కు లేకపోతే వెయ్యి రూపాయలు జరిమానా

Satyam NEWS

రగులుతూనే ఉన్న మణిపూర్

Satyam NEWS

Leave a Comment