27.7 C
Hyderabad
April 20, 2024 01: 08 AM
Slider ముఖ్యంశాలు

పంచాయతీ నిధులను ఉచిత పధకాలకు మళ్లింపు..

నవరత్నాలంటూ జగన్ ప్రభుత్వం ప్రతీ నెల ఒకటో తారీఖు రోజున పధకాల లబ్ధిదారులకు ఉచితంగా డబ్బులు ఇచ్చి…గ్రీన్ అంబాసిడర్స్ ను పస్తులు పెడుతున్నారంటూ ఏఐటీయూసీ ఆరోపించింది. పంచాయితీ నిధులు ఉచిత పథకాలకి మళ్ళించి గ్రీన్ అంబాసిడర్ కార్మికులను ఆకలితో చంపుతారా..? అంటూ ధ్వజమెత్తింది. గ్రామీణ ప్రాంతాల్లో చెత్తాచెదారం, కాలువలు తీసే పారిశుద్ధ్య కార్మికులు గ్రీన్ అంబాసిడర్ కార్మికుల జీతాల కోసం కేటాయించిన నిధులను ఉచిత పథకాలకు మళ్ళించి కార్మికులను ఆకలితో చంపుతారా అని జగన్ ప్రభుత్వం పై ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మండిపడ్డారు.

ఈ మేరకు జిల్లా లో గుర్ల మండలంలో ఏ.పి గ్రీన్ అంబాసిడర్ వర్కర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ అనుబంధం ) ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ యూనియన్ జిల్లా కన్వీనర్ పురం అప్పారావు నేతృత్వంలో విజయనగరం జిల్లాలహ గుర్ల ఎమ్.పి.డి.ఓ కార్యాలయం ముందు నిరసన ధర్నా జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ ఏఐటీయూసీ జిల్లా సమితి తరపున మీ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న పోరాటానికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. మీ పోరాటం విజయవంతం కావాలని కాంక్షిస్తున్నామన్నారు.

భవిష్యత్తులో జిల్లాలో మొత్తం అన్ని గ్రామాల్లో ఉన్న గ్రీన్ అంబాసిడర్ వర్కర్లుని కదిలించి పెద్ద ఎత్తున పోరాటాలకి, అవసరమైతే సమ్మెకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల పాదయాత్రలో పారిశుధ్య పనులు చేస్తున్న వారి కష్టానికి లక్ష రూపాయలు జీతాలు ఇచ్చినా తక్కువే అని, వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన జల్లుకుంటే పుణ్యం వస్తుందని చేసిన ఉపన్యాసాలు కేవలం సీఎం పీఠం కోసం కార్మికుల ఓట్ల కోసం చేసిన మోసపూరిత ఉపన్యాసాలే అని ధ్వజమెత్తారు. సీఎం గారు మీరు, మీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి నెలా జీతాలు తీసుకుంటూ మీ ప్రాంతాల్లో మురికివాడలు శుభ్రం చేస్తూ మీ ఆరోగ్యాలను, ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ కార్మికులు రోగాల భారిన పడుతూ త్యాగం చేస్తున్న కార్మికుల జీతాలు మాత్రం ప్రతీ నెలా ఇవ్వరా అని ప్రశ్నించారు. మీరంతా ఒక్క నెల జీతం తీసుకోకుండా ఉండగలరా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న కార్మికులకు మీరు అసెంబ్లీలో చెప్పిన ప్రకారం 18 వేలు వేతనం పెంచకపోతే ప్రత్యక్ష పోరాటం తప్పదని హెచ్చరించారు.

రెండేళ్ళుగా పెండింగులో ఉన్న జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరం అయ్యేవరకు గ్రీన్ అంబాసిడర్ కార్మికులందరికి ఏఐటీయూసీ అండగా ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు పెంపుదల చేయలేకుండా చాలీచాలని జీతాలు నెలల తరబడి ఇవ్వకుండా గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారికి కనీస మౌళిక సదుపాయాలు కూడా కల్పించలేకపోవడం దారుణమన్నారు. కరోనలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి పనులు చేశారన్నారు. సబ్బులు, కొబ్బరి నూనె, ఏడాదికి 3 జతల బట్టలు, బూట్లు, గ్లౌజ్ లు ఇవ్వకపోతే వారికి వచ్చే జబ్బులకు.ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కార్మికులు మరణిస్తే దహన ఖర్చులు ఇవ్వలేదని అన్నారు. పి.ఎఫ్, ఐ. ఎస్.ఐ సదుపాయాలు లేక రోగాలు వస్తే బాగుచేయించుకునే అవకాశాలు కూడా లేవన్నారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే దశాలవారి పోరాటాలు తప్పవని వారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో గుర్ల మండల అధ్యక్షుడు దాసరి పూడయ్యా, ప్రధాన కార్యదర్శి బొత్స పోలిరాజు, ఉపాధ్యక్షుడు గంగరాజు, సహాయ కార్యదర్శి అచ్చప్పడు, కోశాధికారి సీతారాం, మెంబర్లు బంగారి అప్పలరాజు, నాగరాజు, వడ్డాది రమణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీజేపీ అగ్రనేత ఎల్.కే.అద్వానీకి అస్వస్థత

Satyam NEWS

ప్రజల సమస్యలపై కార్పొరేషన్ పట్టించుకోలేదు..మీరే మాకు దిక్కు

Satyam NEWS

గుజరాత్ లో కాంగ్రెస్ కు ఊహించని ఎదురుదెబ్బ

Satyam NEWS

Leave a Comment