33.2 C
Hyderabad
April 26, 2024 01: 20 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఎక్స్ క్లూజీవ్: త్వరలో ఆంధ్రప్రదేశ్ పేదలకు పెద్ద శుభవార్త

ys elecreinics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో కాలంగా తిష్టవేసుకుని ఉన్న అతి పెద్ద సమస్యను పరిష్కరించే దిశగా జగన్ ప్రభుత్వం ముందడుగు వేయబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. చాలా కాలంగా శాశ్వత నివాసాలు నిర్మించుకుని నివశిస్తున్న పేదలకు, చాలా సంవత్సరాలుగా భూమిని సాగు చేస్తూ ఎలాంటి అధికారం లేకుండా మిగిలిపోయిన డికెటి పట్టాదారులకు ప్రభుత్వం ఒక పెద్ద వెసులుబాటు కల్పించబోతున్నది.

దీని కోసం త్వరలోనే సమగ్ర చట్టాన్ని రూపొందిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు ఇవ్వడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తున్నది. ఇలా వచ్చిన భూములను డికెటి పట్టా భూములుగా పిలుస్తారు. ఈ భూముల్లో సాగు చేసుకోవడం, నివాసానికి ఇస్తే నివాసం ఉండటమే తప్ప అమ్మడానికి అకాశం లేదు. ఎవరికి కేటాయించారో వారి తదనంతరం వారి వారసులకు ఈ భూమి వచ్చేస్తుంది.

ఇలాంటి భూములను ఎస్సి ఎస్టీ లకు ఎక్కువగా కేటాయించేవారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న ఇతర కులాల వారికి అతి తక్కువ సంఖ్యలోనే డికెటి పట్టాలు ఉన్నాయి. ఈ విధమైన డికెటి భూములను రెగ్యులరైజ్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నది.

ఇలా లక్షలాది ఎకరాలలో ఉన్న డికెటి భూములను రెగ్యులరైజ్ చేసేందుకు నివాస భూమి అయితే ఒక ఫీజు, వ్యవసాయ భూమి అయితే ఒక ఫీజు చెల్లించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ విధంగా చేయడం వల్ల ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న డికెటి పట్టాల సమస్యను పరిష్కరించినట్లవుతుంది. ఇది ఎన్నికల ప్రణాళికలో కూడా వైసిపి చెప్పి ఉన్నందున ఎన్నికల హామీ నెరవేర్చినట్లు అవుతుంది.

వీటన్నింటితో బాటు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. పీకల్లోతు ఆర్ధిక కష్టాలలో కూరుకుపోయి ఎక్కడా అప్పులు కూడా పుట్టని స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు డికెటి పట్టాల క్రమ బద్దీకరణ ద్వారా ఒక ఏడాది ఖర్చులకు సరిపడా సొమ్ములు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల తాత్కాలికంగా ప్రభుత్వానికి ఆదాయం, పేదలకు మేలు అనే రెండు అంశాలతో బాటు రాజకీయ అంశాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి.

Related posts

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో షబ్బీర్ భేటీ

Satyam NEWS

ఓపెన్ స్కూల్ విద్య ను సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

కేంద్ర మంత్రులతో కడప ఎంపి అవినాష్ రెడ్డి భేటీ

Bhavani

Leave a Comment