29.7 C
Hyderabad
April 18, 2024 05: 50 AM
Slider కడప

రెడ్ల ప్రభుత్వం రావాలనుకున్న వాళ్లకు బుద్ధి వచ్చింది

#dlravindrareddy

రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఘాటుగా స్పందించిన భూములు ఆక్రమించుకోవడం ఖజానా నింపుకోవడమే పాలకులు పనిగా ఉందని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. కడప జిల్లా లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన తెలిపారు.

సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన డిఎల్ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి వచ్చేందుకు నిర్ణయించుకున్నారు. ఏ పార్టీ తరపున పోటీ చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేనని డీఎల్ అన్నారు. రాష్ట్రంలో మంత్రులు డమ్మీలుగా మారిపోయారని ఆయన అన్నారు.

రెడ్ల ప్రభుత్వం రావాలని కోరుకున్న వారందరికీ తగిన బుద్ధి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిస్థితి నెలకొంది. వ్యవసాయం సంక్షోభంలో పడిపోయింది. రైతును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

దొంగ ఆయిల్ వ్యాపారం చేసే అంబటి కృష్ణారెడ్డి కి వ్యవసాయ శాఖలో సలహాదారుడి పదవి ఇచ్చారు అని ఆయన వ్యాఖ్యానించారు. సొంత ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పాలకులు పని చేస్తున్నారని డిఎల్ అన్నారు. రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం లేదని, దారినపోయే వారందరూ ప్రెస్ మీట్ లు పెడుతున్నారని డిఎల్ అన్నారు.

ప్రభుత్వం ఇచ్చే ఐదు వందలు, వెయ్యికి ఆశపడి ఎవరు బ్రతక వద్దని ఆయన అన్నారు. సొంతంగా సంపాదించుకోవడం నేర్చుకోండి..సమాజంలో జరుగుతున్న అక్రమాలపై పాలకులను మీడియా ప్రశ్నించాలి… ప్రశ్నించుకుంటే అధోగతి పాలవుతుంది అని ఆయన అన్నారు.

Related posts

కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే జీవో రద్దు చేయాలి

Bhavani

మానవ మనుగడకు పచ్చని చెట్లే ఆధారం…!

Satyam NEWS

Controversy: కష్టమర్ సర్వీస్ గా మారిన ఐఏఎస్ లు

Satyam NEWS

Leave a Comment