27.7 C
Hyderabad
April 20, 2024 00: 23 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో ఆసుపత్రులను తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

#hospital

వనపర్తిలో వి.కేర్.హాస్పిటల్, బస్టాండ్ దగ్గర మహా లక్ష్మీ పాలి క్లినిక్ ను వనపర్తి డిఎంహెచ్ఓ డాక్టర్ రవిశంకర్ తనిఖీ చేశారు. నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నారని చెప్పారు.వి.కేర్ ఆసుపత్రిలో అనుమతికి మించి బెడ్స్ ఏర్పాటు చేశారని,ర్యాంపు లేదని,లిఫ్ట్ సరిగ్గా లేదని,రోగులకు సరిపోయిన బాత్ రూములు సరిగ్గా లేవన్నారు.కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్,ఫైర్ సేఫ్టీ ఎన్.ఒసి లేదని ఆయన తెలిపారు. మహా లక్ష్మీ పాలి క్లినిక్ లో డాక్టర్ల సర్టిఫికెట్ అందుబాటులో లేదని,రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ప్రదర్శించలేదని,బయో మెడికల్,పొల్యూషన్ పత్రం లేదని చెప్పారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో చంద్రయ్య, మధు,నర్సింహ రావు పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

డివైన్ పవర్:జూన్‌ 23 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

Satyam NEWS

నాయకపోడు కులస్తుల గణేష్ ఉత్సవంలో పాల్గొన్న డిఎస్పీ

Satyam NEWS

జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment