28.7 C
Hyderabad
April 24, 2024 04: 02 AM
Slider జాతీయం

లాక్ డౌన్ తో కరోనా కేసులు అదుపులోకి వచ్చేనా?

#coronaVirus

భారతదేశంలో 4 సార్లు వరుస లాక్డవున్లు విధించినప్పటికీ … కోవిడ్ -19 కేసులు, మరణాలు గత ఏడాది సెప్టెంబర్ నెలలో విపరీతంగా పెరిగాయి. 2021 జనవరి 16 నుంచి రెండు వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం కేంద్రం ఆదేశాల ప్రకారం 45 ఏళ్ళు దాటిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన అమలవుతోంది.

ఇప్పటివరకు 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్ పంపిణీ అయినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.  ఇంతటి బృహత్తర కార్యక్రమంలో వ్యాక్సిన్ తీసుకున్న కారణంగా ఉత్పన్నమయ్యే దుష్ఫలి తాలను ముందుగా పసిగట్టే బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది.

అటువంటి  దుష్ప్రభావాలు సంభవించినప్పుడు సమీక్షించేందుకు సాంకేతిక నిపుణుల బృందాలతో కూడిన కమిటీలను ప్రపంచ ఆరోగ్యసంస్థ నియమించింది. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత సంభవించిన దుష్పరిమాణాలపై తగిన పరిశోధన చేపట్టి , నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత ఈ కమిటీలకు ఉంది.

సామాన్యులు ….ప్రభుత్వం తమను కరోనా బారిన పడకుండా రక్షించేందుకు వ్యాక్సిన్ ఇస్తుందని విశ్వసించడం సహజం.

మార్చినెలవరకు ఒక్కసారి గమనిస్తే… అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అనారోగ్యం పాలైన 617 కేసులలో 180 మంది మరణించినట్లు తెలుస్తోంది.

ఈ తరహా మరణాలకు వేక్సిన్ కారణం కాదని ఎటువంటి విచారణ జరుపకుండానే నిపుణుల కమిటీ చెబుతోంది.

మీడియా కథనాల ప్రకారం… కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత గుండెఆగిపోవడం,గుండెపోటు, మెదడులో నరాలు చిట్లిపోవడం వంటి కారణాలవల్ల ఎక్కువమంది చనిపోయినట్లు తెలుస్తోంది.

జర్మనీ, నార్వే , ఐర్లాండ్, డెన్మార్క్, ఐలాండ్ వంటి దేశాలలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వినియోగం తరువాత మెడదులో రక్తం గడ్డకట్టడం వల్ల మరణాలు చోటుచేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. 

భారత్ కు చెందిన కమిటీ కూడా వాక్సినేషన్ కు మరణాలకు సంబంధం లేదని స్పష్టం చేస్తోంది. ఏ ఈ ఎఫ్ ఐ సలహాదారు, కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ సభ్యుడు డా.ఎన్ .కే. అరోరా ఇదే విషయాన్ని చెప్పారు. 

దేశంలో ప్రతి వయోజన వ్యక్తికి కోవిడ్ – 19 నిరోధక వ్యాక్సిన్ అందించాలన్న లక్ష్యం ఎంత గొప్పదైనా … వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సంభవించే అసాధారణ మరణాలకు గల కారణాలు అన్వేషించాల్సిన గురుతర బాధ్యత కేంద్ర ప్రభుత్వం స్వీకరించాలి.

ఒకవేళ …. ఇతరత్రా కారణాలవల్ల వ్యాక్సిన్ అనంతరం మరణాలు సంభవించినా వాటి వివరాలు వెల్లడి చేయడంలో గోప్యత పనికిరాదనటున్న ఆరోగ్య నిపుణుల సూచన గమనార్హం.

ఇప్పటికే పెరుగుతున్న రెండవ దశ కేసులతో భయం ఆవరించి న దేశప్రజలలో వాక్సిన్ పట్ల పుట్టుకొస్తున్న సందేహాలు నివృతి చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేయాల్సిన క్లిష్ట సమయమిది.

పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

కరీంనగర్ తీగల వంతెన పై షూటింగ్ సందడి

Satyam NEWS

ముక్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా మెడికల్ కిట్

Satyam NEWS

తిరుపతి భూకబ్జాదారులకు ప్రొఫెసర్ భూమన్ వార్నింగ్

Satyam NEWS

Leave a Comment