39.2 C
Hyderabad
March 29, 2024 16: 43 PM
Slider మహబూబ్ నగర్

పక్క రాష్ట్రం వాళ్లను రానిస్తే కఠిన చర్యలు

E.Sridhar

కృష్ణా నదిలో చేపలు పట్టే వారికి ఎలాంటి ఆటంకం కలిగించవద్దని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఇ.శ్రీధర్ ఆదేశించారు. నేడు ఆయన జిల్లా ఎస్పీ డాక్టర్ వై. సాయి శేఖర్ తో కలిసి మంచాలకట్ట జటప్రోలు చెక్ పోస్టులను తనిఖీ చేశారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చేవారిని కచ్చితంగా నిలిపివేయాలని, ఎవరిని రానివ్వద్దని ఆయన అన్నారు.

అలా వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. మంచాలకట్ట చెక్ పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బంది సర్పంచ్ విజయ్ కుమార్ తో కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. మంచాలకట్ట గ్రామానికి సంబంధించిన వారు చేపలు పట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, వారు తమ వృత్తిని కొనసాగించుకోవాలని సూచించారు.

నదీ ప్రాంతం అవతల నందికొట్కూర్ పగిడ్యాల నెహ్రూ నగర్ వాసులను జిల్లాలోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని పోలీస్, పంచాయతీ రాజ్ సిబ్బందిని ఆదేశించారు. గ్రామంలో 50 శాతం మంది ప్రజలు చేపలు పట్టే వృత్తిని కొనసాగిస్తున్నారని, రోజుకు పది క్వింటాళ్ల చాపలను ఇక్కడి నుండి ఎగుమతి చేయనున్నారని సర్పంచ్ విజయ్ కుమార్ వారి దృష్టికి తీసుకువచ్చారు.

చేపలు పట్టే వారు ఏ సమయంలో ఎంతమంది నది లోకి ప్రవేశించారో తిరిగి ఎంతమంది వచ్చారు పూర్తి సమాచారాన్ని సేకరించాలని, చేపలు పట్టే వారి జీవనోపాధికి ఎలాంటి అంతరాయం కలిగించకూడదని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు.

కర్నూలు జిల్లాకు సంబంధించిన ఏ ఒక్కరిని కూడా జిల్లాలోకి అనుమతించరాదని, ఇక్కడి నుండి ఎవరు కూడా ఆ ప్రాంతాలకు వెళ్లకూడదని పూర్తి బాధ్యత సర్పంచ్ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

అనంతరం జటప్రోలు చెక్ పోస్ట్ ను సందర్శించి వాహనాల ప్రవేశాల పై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతి లేని వాహనాలను అనుమతించరాదని ఆదేశించారు అదేవిధంగా చెక్ పోస్ట్ లో పోలీస్ సిబ్బంది కేటాయించిన వసతులను పరిశీలించారు.

పోలీస్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజనం, అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఎస్సైని ఆదేశించారు. జటప్రోలు సర్పంచ్ షేక్ ఖాజా తో మాట్లాడుతూ గ్రామంలోకి కర్నూల్ గద్వాల జిల్లాల నుండి ఎవరిని అనుమతించరాదని మన జిల్లాలో పూర్తిస్థాయిలో కారోనా ను అదుపు చేయగలిగామని ఆయన అన్నారు.

కొత్త వారిని ఎవరిని కూడా జిల్లాలోకి అనుమతిస్తే తీవ్ర స్థాయిలో ప్రమాదం తలెత్తుతుందని, అందుకు జిల్లా సరిహద్దు గ్రామాల సర్పంచులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సర్పంచులకు సూచించారు. సీఐ వెంకట్రెడ్డి, పెంట్లవెల్లి ఎస్సై శ్రీనివాస్ వెంట ఉన్నారు.

Related posts

గ్రామీణులకు అండగా నిలిచిన టీఆర్ఎస్ నేత

Satyam NEWS

ఆత్మ గౌరవ భవనాలు కేటాయించాలి: బీసీ సంఘాల ప్రతినిధులు

Satyam NEWS

సి విజిల్ యాప్ పై ప్రజల్లో అవగాహన

Satyam NEWS

Leave a Comment