40.2 C
Hyderabad
April 19, 2024 16: 18 PM
Slider పశ్చిమగోదావరి

కరోనా వార్తలకు సంబంధించి పుకార్లను నమ్మవద్దు

#Polavaram Police

కరోనాకు సంబంధించిన వార్తలను సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై  I T యాక్ట్ ద్వారా కేసులు నమోదు చేస్తామని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం పోలీస్ ఎస్ ఐ ఆర్. శ్రీను హెచ్చరించారు. ప్రజలు పుకార్లు నమ్మవద్దని, కరోనాకు సంబంధించిన ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలని ఆయన కోరారు.

పోలవరం మసీదు సెంటర్, మెయిన్ బజార్ లలో కరోనా పాజిటీవ్ కేసులు వచ్చాయని ఆయన తెలిపారు. అంతే తప్ప పరిస్థితి ప్రమాదకరంగా లేదని ఆయన అన్నారు. గత 80 రోజులు నుండి ప్రజల సహకారం తో లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేశామని, ప్రజలు, వ్యాపారస్తులు క్రమశిక్షణ పాటించి సహకరించారని ఆయన అన్నారు.

కానీ అంత కన్నా ఎక్కువ క్రమశిక్షణతో ఇప్పుడు ఉండాలని, సామజిక దూరం పాటిస్తూ, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆయన కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారని ఆయన తెలిపారు. రెడ్ జోన్ విధించిన ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని, ప్రజలు గుంపులు, గుంపులు గా వద్దని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు.

ఎవరైనా చట్టవ్యతిరేకమైన కార్యక్రమంలో పాల్గొనట్లు తెలిస్తే స్థానిక పోలీసులు కు సమాచారం తెలపాలని ఆయన కోరారు. ఇసుక,సారా ,గుట్కా,పాన్,అక్రమ మద్యం అమ్మిన,కలిగి ఉన్న చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Related posts

నవంబర్ 22న శ్రీ ధర్మ శాస్త్ర విగ్రహ ప్రతిష్టాపన

Satyam NEWS

పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి

Satyam NEWS

ఆరోగ్యంతో ఎలా బతకాలి?: నాగర్ కర్నూల్ ఎస్పి సూచన

Satyam NEWS

Leave a Comment