నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని మంత్రి కేటీఆర్ కోరారు. రాష్ట్ర‘ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం శాసనమండలి సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా యూరేనియం తవ్వకాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కొందరు రాజకీయ నాయకులు యురేనియం తవ్వకాలపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నల్లమలలో యురేనియం ఉందా లేదా అని తెలుసుకోవటానికి మాత్రమే ఏఎమ్‌డీ వాళ్లు పరీక్షలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఒక ఎంపీ అక్కడి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఒక పార్టీ అధ్యక్షుడు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదని మంత్రి అన్నారు. 2009లో తవ్వకాలకు పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తవ్వుతున్నది బీజేపీ అని మేము చెప్పవచ్చు.. కానీ, మేము చెప్పము. యురేనియం తవ్వకాలపై సీఎంతో చర్చించి అధికారికంగా తీర్మానం పెట్టేలా ప్రయత్నం చేస్తాము. మేము తప్పు చేయం.. చెయ్యబోం’’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాత్రి వేళ పనులు చేయకూడదని, బోర్లు తవ్విన వాటిని పూడ్చాలని చెప్పామన్నారు.
previous post