24.7 C
Hyderabad
March 29, 2024 06: 54 AM
Slider నల్గొండ

డిమాండ్: కరెంటు చార్జీల భారం తగ్గించాలి

#Komatireddy Venkatreddy MP

కరోనా సమయంలో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు కరెంట్ రూపంలో మోయలేని భారం వేయవద్దని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాశారు. 3 నెలలుగా కరోనా కారణంగా ఉపాధి లేక జీవిస్తున్న పేద ప్రజలను కరెంట్ చార్జీలు పెంచి మరింత ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వెంటనే కరెంట్ మదింపు లో సవరింపులు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

లాక్డౌన్ కాలంగా ప్రజలు ఉపాధి కోల్పోయారని, ఈ కరెంటు బిల్లులు పేద ప్రజలను మరింత పేదవారిగా మారుస్తుందని ఆయన అన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రజలపై ఇంత కక్ష్య సాధింపు చర్యలు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. కష్ట కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజలను పీడించి ఖజానా నింపుకోవాలని చూస్తున్నదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఖజానా నింపడం కోసం పేద ప్రజల రక్తం పిలుస్తావా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

Related posts

సో శాడ్: ఎన్నికల పిచ్చితో అల్లాడుతున్నాడు

Satyam NEWS

బడ్జెట్ స్టోరీ: గ్రోతూ లేదు రూటూ లేదు

Satyam NEWS

మైదుకూరు మున్సిపాలిటీలో మాయ చేసిన వైసీపీ

Satyam NEWS

Leave a Comment