36.2 C
Hyderabad
April 23, 2024 20: 53 PM
Slider నల్గొండ

చిన్న చిన్న సమస్యలకు పోలీస్ స్టేషన్లకు రావద్దు

#Hujurnagar CI

చిన్న చిన్న విషయాలకు పోలీస్ స్టేషన్ లకు రావద్దని, ఏదయినా సమస్య ఉంటే ఒకరు లేదా ఇద్దరు ఆయా పరిధిలోని పోలీసు స్టేషన్లలోని రిసెప్షన్ దగ్గర వరకే వెళ్ళాలని హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కరోన వైరస్ తీవ్రంగా వున్న  నేపథ్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రజలకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రిసెప్షన్ వద్దకే పోలీసు స్టేషన్ అధికారి గాని, ఉన్నతాధికారి గాని సమస్యను పరిష్కరిస్తారని ఆయన అన్నారు.

పోలీసు స్టేషన్ ఆవరణలో మాస్కు తప్పనిసరిగా ధరించి భౌతిక దూరం తప్పక పాటించాలని, ప్రజలంతా సోదర భావంతో కలిసి మెలసి ఉంటూ కరోనా వైరస్ పై పోరాడాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావద్దని, కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నందున అత్యవసరం అయితేనే  తప్పని సరిగా మాస్కు ధరించి బయటకు రావాలని, ప్రజలు పోలీస్ శాఖా వారికి సహకరించాలని కోరారు.

Related posts

అర్హులైన పేద దళిత జర్నలిస్టుకు దళితబందు మంజూరుకు కృషి

Satyam NEWS

రైస్ మిల్లు కార్మిక కుటుంబాలకు యాజమాన్యం అండగా నిలవాలి

Satyam NEWS

మహా శివరాత్రి ప్రత్యేకం: మృత్యుదోషాలను నివారించే భోళా శంకరుడు

Satyam NEWS

Leave a Comment