39.2 C
Hyderabad
March 28, 2024 15: 20 PM
Slider విజయనగరం

జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ లక్షణాలతో ఆందోళన చెందవద్దు

#vijayanagarampolice

కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడకుండా ఉండేందుకు  నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, సాధారణ జలుబు, దగ్గు, జ్వరంతో ఆందోళన చెందవద్దని పోలీసు అధికారులు, సిబ్బందికి విజయనగరం జిల్లా ఎస్పీ  దీపిక సూచించారు.

కోవిడ్ బారిన పడి ప్రస్తుతం హోమ్ ఐసోలేషనులో ఉంటున్న పోలీసు అధికారులు, సిబ్బంది కరోనా విపత్కర సమయంలో వివిధ పోలీసు స్టేషనుల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిలో ఆత్మ విశ్వాసం నింపేందుకు జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించారు.

ఈ జూమ్ కాన్ఫరెన్సులో విజయ నగరంకు చెందిన ఎన్.ఆర్.ఐ. ఆసుపత్రి వైద్య నిపుణులు డా. ఎ.వివేక్ మరియు ఆసుపత్రి యాజమాన్యం పరిపాలన విభాగానికి చెందిన రమేష్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జూమ్ కాన్ఫరెన్సులో పాల్గొన్న జిల్లా ఎస్పీ ఎం. దీపిక పోలీసు సిబ్బంది, అధికారులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పోలీసు సిబ్బంది లేదా వారి కుటుంబ సభ్యులకు అనారోగ్య పరమైన ఏమైనా ఇబ్బందులు తలెత్తితే సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేయాలని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ పోలీసు సిబ్బందికి భరోసాను కల్పించారు.

ఫ్రంట్ లైను వారియర్స్ గా పోలీసులు విధులు నిర్వహిస్తున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా నాణ్యతగల డబుల్ మాస్క్ లు ధరించాలని, వ్యక్తుల మధ్య సోషల్ డిస్టన్స్ పాటించాలని, చేతులను శానిటైజరు లేదా సబ్బుతో తరచూ శుభ్రం చేసుకోవాలన్నారు.

కరోనా వ్యాధిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి

అదే విధంగా కరోనా ప్రొటోకాల్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని, అందుకు ప్రత్యేకంగా ఆటోలను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆదేశించారు.

ఎన్.ఆర్.ఐ. వైద్య నిపుణులు డా. ఎ.వివేక్ పోలీసుల సందేహాలను ఎంతో శ్రద్ధతో, ఓపికతో విని, వాటిని నివృత్తి చేసారు. అదే విధంగా, అవసరమైన పోలీసు అధికారులు, సిబ్బంది వాడాల్సిన మందులను సూచించారు. ఏమైనా వైద్యపరమైన సలహాలు కావాలనుకుంటే తనను నేరుగా సంప్రదించవచ్చునని, తాను ఎల్లవేళలా ఫోనుకు అందుబాటులో ఉంటానని భరోసాను పోలీసు సిబ్బందికి కల్పించారు.

ప్రస్తుతం అందరికీ జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు సాధారణమేనని, అనవసరంగా ఆందోళన చెందవద్దన్నారు. వ్యాధి లక్షణాలు వరుసగా నాలుగు రోజులు వరకు తగ్గకపోయినా, వ్యాధి లక్షణాలు ఇంకనూ ఎక్కువైనా డాక్టర్లు ను సంప్రదించాలన్నారు.

ఈ జూమ్ వీడియో కాన్ఫెరెన్స్ లో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, ఎస్ బి అదనపు ఎస్పీ ఎన్.శ్రీదేవీరావు, ఒఎస్టీ ఎన్. సూర్యచంద్రరావు, విజయనగరం అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి, బొబ్బిలి డీఎస్పీ బి.మోహనరావు, పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావు, ఏస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దిశ పిఎస్ డీఎస్పీ టి.త్రినాధ్, ఏఆర్ డీఎస్పీఎల్.శేషాద్రి, సిఐలు బి.వెంకటరావు, జి. రాంబాబు, రుద్రశేఖర్, జి.మురళి, సి. హెచ్. లక్ష్మణ రావు, టి.ఎస్.మంగవేణి, విజయనాధ్, బాల సూర్యారావు, సింహాద్రినాయుడు, సిహెచ్. శ్రీనివాసరావు, డి.రమేష్, జి.సంజీవరావు, ఎం.నాగేశ్వరరావు, పి. శోభన్ బాబు, ఎల్.అప్పలనాయుడు, టి.వి తిరుపతిరావు, విజయ ఆనంద్ నర్సింహమూర్తి, వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మొబిక్విక్‌, స్పైస్‌ మనీలకు ఆర్బీఐ వాత

Sub Editor

కర్నూలు ఎస్పీగా కృష్ణకాంత్ పదవీ స్వీకారం

Satyam NEWS

కాంట్రవర్సీ: సింహాచలంలో రాజకీయ నిర్ణయాలు

Satyam NEWS

Leave a Comment