28.7 C
Hyderabad
April 20, 2024 10: 11 AM
Slider మహబూబ్ నగర్

హాల్ టికెట్ ఇవ్వకుండా 10 వ తరగతి విద్యార్థులను వేధించవద్దు

కొల్లాపూర్ లో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలు హాల్ టికెట్ పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయొద్దు అని కొల్లాపూర్ మండల కేంద్రం లో కుడికిళ్ళ గ్రామంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం లో విద్యార్థి సంఘం నేత డి. శేఖర్ అన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేత డి.శేఖర్ మాట్లాడుతూ ఫీజుల పేరుతో హాల్ టికెట్ ఇవ్వకుండా, కొన్ని బడా ప్రైవేట్ పాఠశాలలు మొత్తం ఫీజులు కడితెనే హాల్ టికెట్ ఇస్తం, లేకపోతే మీరు పాస్ అవ్వలేరు అని విద్యార్థులను భయ భ్రాంతులకు గురి చేస్తున్న పాఠశాలల పై, అధిక పిజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల పై జిల్లా ఉన్నత విద్య అధికారులు చొరవ తీసుకొని కార్పొరేట్ పాఠశాలల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.. ఎస్సీ ఎస్టీ వెనుకబడిన విద్యార్థులకు ప్రతి ప్రవేట్ పాఠశాలలో 25% ఉచిత విద్యను అందించని పాఠశాలల పై,విద్య హక్కు చట్టాన్ని అమలు చేయని ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు… ఆంధ్రలో పదో తరగతి ప్రశ్నపత్రం పేపర్ లీకేజీ కారణమైన నారాయణ ,శ్రీచైతన్య పాఠశాలల మరియు తెలంగాణలో శ్రీ చైతన్య నారాయణ కార్పొరేటు పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని కోరారు.

ఈ సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు శివ. ఆనంద్. రాఘవేంద్ర. దివాకర్.విజయ్. తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈ దృశ్యం మారేదెన్నడు?

Satyam NEWS

బ్యాంకులు ప్రయివేటీకరణ చేస్తే పొదుపుకు ముప్పు

Satyam NEWS

ట్రాఫిక్ రూల్సు పాటిస్తే ప్రమాదాలు జరగవు

Bhavani

Leave a Comment