35.2 C
Hyderabad
April 20, 2024 16: 43 PM
Slider తెలంగాణ

కొల్లాపూర్ కోటలో ప్లాట్లు కొంటే ఆగమౌతారు జాగ్రత్త

jupally 12

చారిత్రాత్మక కొల్లాపూర్ కోట ప్రాంగణంలో ప్లాట్లు చేసి అమ్ముకోవడం చట్ట విరుద్ధమని మాజీ మంత్రి, టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు జూపల్లి కృష్ణారావు అన్నారు. కోట ప్రాంతంలోని భూములపై హైకోర్టులో కేసులు నడుస్తున్నాయని అందువల్ల ఆ ప్రాంతానికి చెందిన భూములను కొనుగోలు చేయడం చట్టరీత్యా చెల్లదని ఆయన మంగళవారంనాడు కొల్లాపూర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా అక్కడ స్థలాలు కొన్నవారు ఇబ్బందుల పాలు కాక తప్పదని జూపల్లి స్పష్టం చేశారు. తాను ఒక శ్రేయోభిలాషిగా చెబుతున్నానని ఆయన అన్నారు. జాగీర్ ఎబాలిషన్ యాక్ట్ ప్రకారం అప్పటి రాజాగారు 1954 లో తమకు ఏ ఏ భూభాగం ఇవ్వాలి, ఏది ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అనే అంశాలపై ఆ నాటి కలెక్టర్ తో ఒక ఒప్పందం చేసుకున్నారని జూపల్లి తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం రాజాగారి కోట కింద వచ్చే ప్రాంతాలు తప్ప వేరే చోట ఎలాంటి ప్లాట్లు వేసుకునే అవకాశం లేదని ఆయన అన్నారు. కోట వెలుపల ఉన్న భూమి అంతా నగర పంచాయితీకి అంటే ప్రభుత్వానికి చెందుతుందని అందులో ప్లాట్లు కేటాయించి అమ్మడం చట్ట విరుద్ధమని అన్నారు. ప్రస్తుత రాజాగారు గతంలో కోర్టుకు వెళ్లి కోట స్థలం తనదని తనకు షాపులు కట్టుకోవడానికి అనుమతివ్వాలని కోర్టును కోరితే దాన్ని కోర్టు తిరస్కరించిందని, ఆ కేసు ఇప్పటికీ హైకోర్టులో పెండింగులోనే ఉందని జూపల్లి కృష్ణారావు తెలిపారు. తన సొంత భూమిలో తాను షాపులు వేసుకుంటాను అని రాజాగారు అంటేనే కోర్టు అనుకూలంగా తీర్పు చెప్పని పక్షంలో ఆయన అమ్మిన భూమి ఎలా చట్టబద్ధమౌతుందని జూపల్లి ప్రశ్నించారు. సేల్ డీడ్ లో సర్వే నెంబర్ లేదు. సర్వే నెంబర్ లేకుండా ప్లాట్లు ఎలా అమ్ముతారు? రాజాగారు చేసింది తప్పు. నా భూమి అంటేనే పర్మిషన్ ఇవ్వలేదు. ఇది చెల్లుతుందా అని జూపల్లి ప్రశ్నించారు. శ్రేయోభిలాషిగా చెబుతున్నాను. పిల్ హైకోర్టులో ఉంది. కోర్టు కేసు అయిన తర్వాత కట్టుకోండి. అంతే కాని లిటిగేషన్ లో ఉన్నభూమిపై ఇల్లు కట్టుకుని ఆగం కావద్దని హితవు పలికారు. ఆ భూమిపై ఇంజెంక్షన్ ఆర్డర్ మాత్రమే ఉందని ఇది తుది తీర్పు కాదని జూపల్లి అన్నారు. గతంలో అప్పటి కొల్లాపూర్ గ్రామ పంచాయితీ ఈ భూములన్నీ తమకు చెందినవేనని కోర్టులో అఫిడవిట్ దాఖలుచేసిన విషయాన్ని కూడా జూపల్లి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కోట వెలుపల ఉన్న భూములు ప్రభుత్వానికి చెందుతాయని ఆయన అన్నారు. ఎవరైనా క్లారిటీ లేకుండా ఇళ్లు కట్టుకుంటే తర్వాత కూలగొట్టే ప్రమాదం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ జేట్పిటిస హను మంత్ నాయక్, తాలుక ప్రచార కార్యదర్శ పసుపుల నరసింహ్మ, సీనియర్ నాయకులు బాలస్వామి, నాయిమ్, రాం దాస్, కె.శ్రీనివాస్, బిజ్జ రమేష్, శేఖర్, దిలీప్, ప్రిన్స్ బాబా తదితరులు పాల్గొన్నారు.

Related posts

సేక్రెడ్ గాడ్: వన దేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

Satyam NEWS

సీజన్ చివరి వరకు సీసీఐ కొనుగోళ్లు జరిగేలా చూడాలి

Satyam NEWS

ఏపిలో మంత్రి కుటుంబానికి కరోనా పాజిటీవ్

Satyam NEWS

Leave a Comment