28.7 C
Hyderabad
April 20, 2024 09: 37 AM
Slider మహబూబ్ నగర్

పడవ ప్రయాణం చేస్తే కఠిన చర్యలు తప్పవు

krishna river

ఆంధ్రప్రదేశ్ లో పెరిగిపోతున్న కరోనా వైరస్ వ్యాధి తెలంగాణ ప్రాంతానికి రానివ్వకుండా జిల్లా ఎస్పీ డాక్టర్ వైయస్ రాజశేఖర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గురువారం పెంట్లవెల్లి ఎస్ఐ ఎం శ్రీనివాసులు కు ఎస్పీ ఆదేశాలు ఇవ్వడంతో మంచాలకట్ట,మల్లేశ్వర కృష్ణ నదీతీరంలో  ఎస్ఐ శ్రీనివాసులు పర్యటించారు.

ఈ సందర్భంగా ఆంధ్ర ప్రాంతం వాసులను మర బోట్ల ద్వారా తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాధి విజృంభిస్తోంది జాగ్రత్తలు పాటించాలన్నారు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి బాద్యతన్నారు. ఈ విధంగా పాటిస్తే ఆంధ్ర ప్రాంతం నుండి కరోనా వైరస్ రానివ్వకుండా కట్టడి చేస్తామన్నారు.

 ఇకపై నదీతీరంలో ఎవరు పర్యటించిన,ప్రయాణం చేసిన కేసులు నమోదు చేస్తామన్నారు. ఎగుమతులు,దిగుమతులు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ శ్రీనివాసులు  హెచ్చరించారు. ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. అంతకముందు మరబోటులో ప్రయాణించి చుట్టుప్రాంతాన్ని పరిశీలించారు.

Related posts

మంత్రివర్గంలోకి అనంత, జంగా దాదాపుగా ఖరారు

Satyam NEWS

తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవా టిక్కెట్ల ధరలు పెంచద్దు

Bhavani

ఢిల్లీకి పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్.. బీజేపీతో జట్టుకేనా?

Sub Editor

Leave a Comment