28.7 C
Hyderabad
April 24, 2024 03: 41 AM
Slider నల్గొండ

స్థానిక రైతుల ధాన్యానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

#Chirumarthy

అన్నం పెట్టే రైతన్నలను ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నాడు నకిరేకల్ ఎంపిడిఓ కార్యాలయంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నియోజకవర్గ  అధికారులతో ధాన్యం కొనుగోలు పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ రైతు పండించిన ప్రతీ గింజను కొనాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఆయన అన్నారు.

రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. స్థానికంగా పండించిన రైతుల ధాన్యానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

పది రోజుల్లో ధాన్యం అంతా కొనుగోలు చేసేలా కలెక్టర్ తో యాక్షన్ ప్లాన్ రూపొందించామని తెలిపారు. అన్నదాతలు అధైర్య పడొద్దని సమన్వయం పాటించాలని తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జేసీ, డిఎం,డిఎస్ఓ,అన్ని మండలాల తహసీల్దార్ లు,మార్కెట్ కమిటీ చైర్మన్ లు, సింగిల్ విండో చైర్మన్ లు, ZPTC లు, AO లు లు,APM లు తదితరులు హాజరయ్యారు.

Related posts

ఏపి హైకోర్టులో చంద్రబాబుకు నాలుగు వారాల ఊరట

Satyam NEWS

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలేరు

Satyam NEWS

నాటు సారా తయారీ బట్టీలపై ఎక్సైజ్ దాడులు

Satyam NEWS

Leave a Comment