31.2 C
Hyderabad
April 19, 2024 05: 56 AM
Slider గుంటూరు

కరోనా డెత్: మత ఆచారాలను ఉల్లంఘించడం మంచిది కాదు

#Shibli

కరోనా వైరస్ తో మృతి చెందిన వారిని ఎవరి మత ఆచారాల ప్రకారం వారిని ఖననం చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా గుంటూరు జిల్లాలో అందుకు విరుద్ధంగా చేస్తున్నారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ఫారూఖ్ షిబ్లీ ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరులో ఒక హోటల్ యజమాని కరోనా పాజిటివ్ తో చనిపోగా అతనిని ఇస్లాం పద్ధతుల ప్రకారం ఖననం చేయాల్సింది పోయి మారుతి నగర్ లోని హిందూ స్మశాన వాటికలో విద్యుత్ యంత్రం పై దహనం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

మత విశ్వాసాలను అవమాన పరచడమే

ఇది మత ఆచారాలను అవమాన పరచడమేనని, ఎవరి ఆచారాల ప్రకారం వారిని ఖననం చేయమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా ఇష్టానుసారం చేయడం కరెక్టు కాదని ఆయన అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వలన 31 మరణాలు సంభవించినప్పటికీ ఎవరికి ఇలా జరగలేదని కేవలం ఒక్క గుంటూరు జిల్లాలోనే జరిగిందని ఆయన అన్నారు.

Related posts

కాపాడుకో?

Satyam NEWS

హెల్ప్ ప్లీజ్: కాళేశ్వరం నిర్వహణకు నిధులు కావాలి

Satyam NEWS

కోర్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment