27.7 C
Hyderabad
April 26, 2024 05: 23 AM
Slider సినిమా

గుర్తుందా శీతాకాలం ఈ జనరేషన్ కు గీతాంజలి

#Satyadev

టాలెంటెడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ యంగ్ హీరో సత్యదేవ్, పాన్ ఇండియా యాక్టర్స్ తమన్నా జంటగా న‌టించిన సినిమా ‘గుర్తుందా శీతాకాలం. క‌న్న‌డ‌లో స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడు మ‌రియు న‌టుడు నాగ‌శేఖ‌ర్ ఈ చిత్రంతో తెలుగులో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వేదాక్ష‌ర ఫిల్మ్స్ , నాగ‌శేఖ‌ర్ మూవీస్ మరియు మ‌ణికంఠ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ పై నిర్మాత‌లు చింత‌పల్లి రామారావు, భావ‌న ర‌వి, నాగ‌శేఖ‌ర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని చిన‌బాబు, ఎం, సుబ్బారెడ్ది లు స‌మ‌ర్సించ‌గా కాల‌భైర‌వ సంగీతాన్ని అందిస్తున్నారు, చిత్రాన్ని డిసెంబ‌ర్ 9 న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. అందులో భాగంగా ట్రైలర్ లాంచ్ చేసి ప్రెస్ మీట్ ను నిర్వహించారు.

దర్శకుడు నాగ శేఖర్ మాట్లాడుతూ ఇది నా డెబ్యూ ఫిలిం, నాకు ఈ అవకాశం కల్పించినందుకు థాంక్యూ. ఎక్కడికి వెళ్లిన ఈ టైటిల్ ఎలా వచ్చింది అని అడుగుతున్నారు. క్రెడిట్ గోస్ టూ హీరో సత్యదేవ్ గారు. డిశంబర్ 9న ఈ సినిమాకి రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి. హీరో సత్యదేవ్ మాట్లాడుతూ ఈ సినిమాలో నాలుగు డిఫెరెంట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ఈ సినిమా ఫోర్ ఫేజ్ స్ అఫ్ లైఫ్. అన్ని సెక్షన్స్ కి కనెక్ట్ అయ్యే ఒక సినిమా గుర్తుందా శీతాకాలం. ఈ నాలుగు ఫేజ్ స్ అయిపోయినవాళ్లు ఉంటారు,ప్రెజెంట్ ఆ ఫెజ్ రన్ అయ్యేవాళ్ళు ఉంటారు. అందరికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.

అన్ని సెక్షన్స్ కి ఇంతకంటే బాగా కనెక్ట్ అయ్యే ఫిల్మ్ ఎవరు చేయలేరేమో నాకు తెలిసి. ఈ సినిమాను భూపాల అన్న రాసేసి డైలాగ్స్ నేరేట్ చేస్తున్నప్పుడు కంప్లీట్ గా నవ్వుతూనే ఉన్నాం. ఈ సినిమా విన్నపుడు ఎలా ఫీల్ అయ్యామో సినిమాను కూడా అదే ఫీల్ తో తెరకెక్కించాడు నాగశేఖర్ అన్న. ఈ జనరేషన్ కి ఒక గీతాంజలి లేదు “గుర్తుందా శీతాకాలం” ఈ జనరేషన్ గీతాంజలి అన్నట్లు ఈ సినిమాను చేసాడు. ఈ సినిమాలో నటించిన తమన్నా, మేఘ ఆకాష్, కావ్యాశెట్టి కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మి భూపాల అన్న నా సినిమా అంటే పెన్ , పేపర్ తో పాటు ప్రేమను కూడా కలుపుతారు. కాల భైరవ ఈ సినిమాకి మంచి సంగీతం అందించారు. ఈ శీతాకాలంలో గుర్తుందా శీతాకాలం గుర్తుండిపోతుంది అంటూ నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

నటీనటులు: స‌త్య‌దేవ్, త‌మ‌న్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియద‌ర్శి, సుహ‌సిని త‌దిత‌రులు

టెక్నికల్ టీం: స్కీన్ ప్లే, డైరెక్ష‌న్ – నాగ‌శేఖ‌ర్, బ్యాన‌ర్ – వేదాక్ష‌ర ఫిల్మ్స్‌, నాగ‌శేఖ‌ర మూవీస్‌, మ‌ణికంఠ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, స‌మ‌ర్ప‌కులు – ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు, నిర్మాతలు – రామారావు చింతపల్లి, భావ‌న ర‌వి, నాగ శేఖర్, కొరియోగ్రఫి – వీజేశేఖ‌ర్
లైన్ ప్రొడ్యూస‌ర్స్ – సంప‌త్, శివ ఎస్. య‌శోధ‌ర‌, ఎక్సీక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – న‌వీన్ రెడ్డి, డైలాగ్స్ – ల‌క్ష్మీ భూపాల్, మ్యూజిక్ – కాల‌భైర‌వ‌, ఎడిటిర్ – కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, సినిమాటోగ్రాఫ‌ర్ – స‌త్య హెగ్డే, స్టంట్స్ – వెంక‌ట్, PRO – ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

Related posts

ఫుల్లు జోష్ లో తెలంగాణ బిజెపి నాయకులు

Satyam NEWS

విలీనం విమోచన మధ్య నలిగిపోవాల్సిందేనా

Satyam NEWS

28న హైదరాబాద్‌లో స్టార్టప్‌ 20-గ్రూప్‌ సమావేశం

Bhavani

Leave a Comment