27.2 C
Hyderabad
September 21, 2023 21: 16 PM
Slider ప్రత్యేకం

హోమియోపతి వైద్య సృష్టి కర్త డా. హనీమన్ విగ్రహ ఆవిష్కరణ

#doctor

హోమియో వైద్య పితామహుడు డా. శామ్యూల్  హానిమన్ పాలరాతి విగ్రహం ( బస్ట్ ) , హిమాయత్ నగర్ , హెచ్ .ఎం. ఎ. టి భవనం, జూపల్లి బాలమ్మ ఆడిటోరియంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఇరిగేషన్ డెవలప్ మెంట్ చైర్మన్, మాజీ కేంద్ర మంత్రి డా. సముద్రాల వేణుగోపాల చారి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేయగా, ఆయుష్ ( హోమియో ) పూర్వ అదనపు సంచాలకులు, హెచ్.ఎం.ఎ.టి గౌరవ సలహాదారు డా.శివశంకర్ కూనపరెడ్డి హానిమన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూర్వ అదనపు సంచాలకులు ( హోమియో ) , డా. జి. జనార్ధన్ రెడ్డి డా. హానిమన్ ప్రతిమకు పూలమాలను సమర్పించారు. ఈ సందర్భంగా డా.హానిమన్ జీవిత విశేషాల గురించి  హెచ్.ఎం.ఎ.టి వారు ప్రశంశ లేఖనం విడుదల చేశారు.

డా. హానిమన్ ఒక కారణ జన్ముడు. గొప్ప శాస్త్రజ్ఞుడు అతని విజ్ఞత అచంచలమైన ఆత్మ విశ్వాసం ,  అకుంఠిత దీక్ష  మొక్కవోని పట్టుదలల ప్రతిఫలమే ఆనాటి  వైరుధ్య విధాన వైద్యపద్ధతులకు సవాలుగా సహజ సరళ హోమియోపతి వైద్యాన్ని ఆవిష్కరించడం జరిగింది. అందుకే ఆయనను ‘ వినూత్న విప్లవ వైద్య విధాత ‘ అని అభివర్ణించడంలో అతిశయోక్తి లేదు.

హానిమన్ మహాశయుడు ఒక పరిపూర్ణ జీవి. ” విజ్ఞతతో జీవించడానికి వెనుకాడ వద్దు ” అని ప్రబోధించిన ధైర్యశాలి. ఆయన సమాధి మీది స్మారక ఫలకం పై ‘ నా జీవితం వ్యర్థం కాలేదు ‘ అని చెక్కిన మాటలు పూర్తిగా సార్ధకమైనవి! ఈనాడు హోమియో వైద్య విధానం యొక్క ఆవశ్యకత పెరిగింది. ప్రపంచ దేశాలన్నీ హోమియో వైద్య విధాన విశిష్టతను ,  గమనిస్తున్నాయి . విజ్ఞాన శాస్త్రవేత్తలు సైతం హోమియో వైద్య శాస్త్రీయతను , విశ్వనీయతను పరిశీలిస్తున్నారు. కొన్ని దేశాల్లో చట్టరీత్యా కూడా దీన్ని గుర్తించారు.

ఇంతటి మహోత్తర వైద్య సంపదను మానవాళికి  అందించిన హానిమన్ , ప్రతి హోమియో వైద్యుడి మదిలో సుస్థిర స్థానాన్ని ఆక్రమించినప్పటికీ , భౌతికంగా ఆయన రూపాన్ని మన కళ్ళెదుట నిర్మించుకోవాలన్న తపనతో  ఆయన పాలరాతి ప్రతిమను ఆవిష్కరించుకోవడం మనందరి అదృష్టం. అందులో మన  ‘ హోమియోపతి మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ‘ ప్రాంగణంలోని జూపల్లి బాలమ్మ ఆడిటోరియంలో  నెలకొల్పుకునే భాగ్యం లభించడం పూర్వజన్మ సుకృతం !

ఇది డా. హానిమన్ ఆశయాలకు ప్రతిరూపం, ఆయన సంకల్పసిద్ధికి కొనసాగింపు, భావి వైద్య తరాలకు ప్రేరణ ! ఇదే మనం ఆ మహా పురుషుడికి ఇచ్చే నిజమైన నివాళి ! డా.హానిమన్ స్ఫూర్తిని కొనసాగిద్దాం .. ఆ అవతార పురుషుడి ఆశయాలను ముందు తరం వైద్యులకు అందిద్దాం. సర్వే జనా సుఖినోభవంతు !!

డా. కె. గోపాలకృష్ణ, అధ్యక్షులు, డా. జి.దుర్గాప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శి

Related posts

తిరుమల ఆకాశ గంగ సమీపంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

Satyam NEWS

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా రాయచోటిలో మానవహారం

Satyam NEWS

బోనాల వైభవం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!