27.7 C
Hyderabad
April 20, 2024 00: 01 AM
Slider ప్రకాశం

కరణం బలరాం కుమార్తె పట్ల ఓ డాక్టర్ ఓవరాక్షన్

#KaranamBalaram

ప్ర‌కాశం జిల్లా సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌ల‌రాం క‌రోనా నుంచి కోలుకుని  హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం హైద‌రాబాద్ లోని త‌న నివాసంలో హోం  క్వారంటైన్ లో ఉన్నారు. క‌రోనా సోకిన వాళ్లు చాలామంది చిన్నచిన్న  అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బెంబేలెత్తుతుంటే 72 ఏళ్ల బ‌ల‌రాం త‌న విల్ ప‌వ‌ర్ తో క‌రోనా నుంచి  కోలుకుని బైట ప‌డ‌డం ఆయ‌న అభిమానుల‌కు ఆనందించ‌ద‌గ్గ వార్తే.

బ‌ల‌రాం క‌రోనా నుంచి బైట ప‌డ‌డం ఒక ఎత్త‌యితే స‌ద‌రు  హాస్ప‌టల్లో బ‌ల‌రాం ఉన్న‌న్ని రోజులు న‌డిచిన హైడ్రామా మ‌రో ఎత్తు. ఆ హాస్ప‌ట‌ల్ లో కిడ్నీ స్పెష‌లిస్ట్ అయిన ఓ డాక్టర్ న‌డిపించిన ఎపిసోడ్ మ‌రో ఎత్తు. బ‌ల‌రాంకు ద‌గ్గ‌రి బంధువునని చెప్పి ఆ డాక్ట‌ర్ ప్రవర్తన అందరిని చికాకు పరిచింది.

కరణం బలరామ్ కు కరోనా కాదని తప్పుడు సమాచారం

క‌రోనా కార‌ణంతో బ‌ల‌రాం  హాస్ప‌ట‌ల్ లో అడ్మిట్ అయితే కేవ‌లం కిడ్నీ స‌మ‌స్య తో మాత్ర‌మే  హాస్ప‌ట‌ల్ లో చేరార‌ని మీడియా ప్ర‌క‌ట‌న చేసిన ఘ‌న‌త కూడా ఆ డాక్ట‌ర్ దే. మొద‌ట్లో బ‌ల‌రాం హెల్త్ కండిష‌న్ బాగా లేద‌ని తెలిసి స‌మాచారం కోసం ఫోన్ చేసిన మీడియా ప్ర‌తినిధుల‌కు ఆ డాక్ట‌ర్  త‌ల‌పొగ‌రుతో స‌మాధానం చెప్పిన తీరు చూసి మీడియా ప్ర‌తినిధులే మండిప‌డే ప‌రిస్థితి.

దూర‌పు బంధువు కాబ‌ట్టి కరణం బలరాం కుమారుడు వెంక‌టేషే ఆమెను తండ్రి ద‌గ్గ‌ర పెట్టాడో లేకుంటే క‌ర‌ణం కుటుంబం పేరు చెప్పుకుని ఓవ‌రాక్ష‌న్ చేసిందో గానీ ఆ డాక్ట‌ర్ వ్య‌వ‌హారం మ‌రీ శృతిమించి అతి దాకా వెళ్లంది. ఆఖ‌రుకు ఎక్క‌డిదాకా వెళ్లిందంటే బ‌ల‌రాం కుమార్తె క‌ర‌ణం అంబికా కృష్ణ  త‌న తండ్రి కండిష‌న్ ఏంటో తెలుసుకునేందుకు ఫోన్ చేస్తే ఇంత‌కీ నువ్వెవ‌రు అని త‌ల‌పొగ‌రుతో ఎదురు ప్ర‌శ్నించేంత‌.

కుమార్తె ఫోన్ చేసినా కట్ చేసిన డాక్టర్

తండ్రి ఆరోగ్యంపై ఆందోళ‌న‌తో ఐసియుకు అంబిక‌ ఫోన్ చేస్తే…ఆ ఫోన్ కూడా బ‌ల‌రాం కు ఇవ్వనివ్వ‌కుండా ఆ డాక్ట‌ర్ డ్రామాలు న‌డిపించింది. డిశ్చార్జ్ అవుతున్న తండ్రిని చూసేందుకు క‌రోనాను కూడా లెక్క చేయ‌కుండా  అంబిక హాస్ప‌ట‌ల్ కు వెళితే క‌నీసం తండ్రిని కూడా చూడ‌నివ్వ‌లేదు.

తండ్రి ఆరోగ్యాన్ని  దృష్టిలో ఉంచుకుని అంబిక సైలంట్ గా ఉండిపోయింది గానీ…అదే స్థాయిలో అంబిక కూడా ఇష్యూను సీరియ‌స్ గా తీసుకుంటే ఆ డాక్ట‌ర్ ప‌రిస్థితి ఎలా ఉండేది? చిన్న వ‌య‌సులోనే రాజ‌కీయాల్లో సొంత వ్య‌క్తిత్వం  క్రియేట్ చేసుకున్న అంబికా కృష్ణ అంటే తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో తెలియ‌ని రాజ‌కీయ నాయ‌కులు లేరు.

పిన్న వ‌య‌సులో బిజెపి లో ప‌లు ప‌ద‌వులు చేప‌ట్టినా, ఆప్ లాంటి పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీ చేసినా ప్ర‌స్తుతం టిడిపిలో ఉన్నాఎంత ఎదిగినా ఒదిగి ఉండాల‌న్న త‌త్వం అంబికా కృష్ణది. ర‌చ‌యిత‌గా పేరుతెచ్చుకుని….త‌న కంటూ  స‌క్సెస్ ఫుల్  బిజినెస్ ఎంపైర్ సృష్టించుకుని.. రాజ‌కీయాల్లో రాణిస్తూ…… డేర్ డెవిల్ గా పేరున్న‌ అంబికా కృష్ణ‌తోనే ఆ డాక్ట‌ర్ త‌ల‌ప‌డాల‌నుకుందంటే …అది ఎవ‌రి అండ చూసుకుని?

కరణం రాజకీయ వారసురాలితో డాక్టర్ పరాచికాలు

క‌ర‌ణం అంబికా కృష్ణ తో ఆర్గ్యూ చేసేంత‌ సీన్ ఆమెకు ఎవ‌రిచ్చారు?….క‌ర‌ణం బ‌ల‌రాం కు అస‌లు సిస‌లు వార‌సురాలిగా…రాజ‌కీయాల్లో పేరు తెచ్చుకుంటున్న అంబిక ప‌ద్ద‌తి ప్ర‌కారం వెళ్లాల‌నుకుంటే …ఆ డాక్ట‌ర్ ఇంత సీన్ ఎందుకు క్రియేట్ చేసింది?…

అటు సొంత కుటుంబ స‌భ్యుల‌తో ఇటు మీడియా ప్ర‌తినిధుల‌తో ఇలాంటి  త‌ల‌తిక్క స‌మాధానాలు చెప్ప‌డం ద్వారా ఇంత‌కీ ఆ డాక్ట‌ర్  ఏం కోరుకుంటోంది?…ఇంత హెడ్ వెయిట్ డాక్ట‌ర్ల‌ను నియ‌మించుకుని హాస్ప‌ట‌ల్  మేనేజ్ మెంట్ పేషంట్ల‌కు ఏం  చెప్పాల‌నుకుంటోంది?

ఎంతో రెప్యుటెడ్ హాస్ప‌ట‌ల్ గా పేరున్న ఆ హాస్ప‌ట‌ల్ లో ఇలాంటి  డాక్ట‌ర్లా?…బ‌ల‌రాం ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి ,ఆ డాక్ట‌ర్ కేంద్రంగా ..ఎవ‌రు …ఏం సాధించాల‌నుకున్నారు?…ఇప్పుడు క‌ర‌ణం అభిమానుల్లో ఆందోళ‌న‌  క‌లిగిస్తున్న ప్ర‌శ్న‌లివి….

Related posts

2000 నోటు ఇక కనుమరుగు

Bhavani

కోనసీమ వైకాపాకు బిగ్ షాక్

Satyam NEWS

సరదాలు తీర్చుకోవడానికి ఈ ముగ్గురూ ఏం చేస్తారో తెలుసా?

Satyam NEWS

Leave a Comment