27.7 C
Hyderabad
April 18, 2024 06: 58 AM
Slider విశాఖపట్నం

డాక్టర్ స్వరాజ్యలక్ష్మి సేవలకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు

#dr.swarajyalaxmi

డాక్టర్ యు. స్వరాజ్యలక్ష్మి రాష్ట్ర అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ కార్యదర్శిగా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రజా ఆరోగ్యము కుటుంబ సంక్షేమం డైరెక్టర్  (ఎఫ్ ఏ సి) గా, అడిషనల్ డైరెక్టర్ గా పదవి బాధ్యతలు నిర్వహించి స్వరాజ్యలక్ష్మి ఇటీవలే పదవీ విరమణ చేశారు. ఆమె చేసిన సేవలకు గాను  ప్రభుత్వం రాష్ట్ర అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ కార్యదర్శిగా నియమించింది.

ఈ మేరకు స్వరాజ్యలక్ష్మిని కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం. తిరుమల కృష్ణ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది పాటు పదవి కాలంలో స్వరాజ్యలక్ష్మి  ఉంటారని ఆ ఉత్తర్వులో  పేర్కొన్నారు.  ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తన సేవలను గుర్తించడం పట్ల కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.

తనను అల్లైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ కార్యదర్శిగా నియమించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కాకుండా చిత్తశుద్ధితో పనిచేస్తానని డాక్టర్ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. పదవి విరమణ చేసిన అనంతరం మరో మారు ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

సమర్థవంతమైన అధికారిణిగా మన్ననలు

డాక్టర్ యు. స్వరాజ్యలక్ష్మి వైద్య ఆరోగ్య శాఖలో వైద్యురాలిగా తన కెరియర్ ప్రారంభించారు. అంచలంచెలుగా ఆమె ఎన్నో పదవులను చేపట్టారు. పలు జిల్లాల్లో డిఎం అండ్ హెచ్ ఓ గానూ,  ఎయిడ్స్, కుష్టు నియంత్రణ శాఖలోనూ, ప్రజా ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖలో అడిషనల్ డైరెక్టర్ గా,  డైరెక్టర్ (ఎఫ్. ఏ. సి.) గానూ పనిచేశారు. ఆమె ఏ పదవి చేపట్టిన చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తూ అందరిని మన్ననలను పొందేవారు.

డాక్టర్ స్వరాజ్యలక్ష్మి అంకితభావంతో తన బాధ్యతలు నిర్వర్తిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచేవారు. తన క్రింద స్థాయి సిబ్బందితో మమేకమవుతూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వారి ప్రేమాభిమానాలను సైతం పొందగలిగారు. అందుకే ఆమె పనిచేసిన ప్రాంతం నుండి మరో ప్రాంతానికి బదిలీ అయితే అక్కడ సిబ్బంది తమ సొంత మనిషి తమకు దూరమవుతున్నట్లుగా భావించేవారు.

దీన్నిబట్టి ఆమె తన తోటి అధికారులు, కింద సిబ్బందితో ఎలా మెలిగే వారు అవగతమవుతుంది. స్వరాజ్యలక్ష్మి చేసిన సేవలను ప్రభుత్వం, ఉన్నతాధికారులు గుర్తించి పదవీ విరమణ చేసిన అనంతరం కూడా మరో కీలక బాధ్యతను అప్పగించడమే  ఇందుకు నిదర్శనం. పదవీ విరమణ చేసి తమకు దూరమైన డాక్టర్ యు. స్వరాజ్యలక్ష్మి తిరిగి అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ కార్యదర్శిగా రావడం పట్ల గతంలో ఆమెతో పని చేసిన అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

కాలుష్య ఫార్మా సిటీ ఏర్పాటుపై కమిటీ వేయాలి

Satyam NEWS

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి 50 శాతం తగ్గిస్తున్న సీరం

Sub Editor

సీనియర్ జర్నలిస్ట్ మారుతి ప్రసాద్ మృతి

Satyam NEWS

Leave a Comment