ప్రకృతి అందాలను ఆస్వాదించడమే కాదు వాటిని పరిరక్షించి భావి తరాలకు అందించాలనేది ఒక బృహత్ కార్యక్రమం. అందులో భాగం పంచుకుంటున్నది డాక్టర్ తేజశ్విని మనోఙ్ఞ. 2019 మిస్ ఎర్త్ ఇండియా గా ఎన్నికైన డాక్టర్ తేజశ్విని మనోఙ్ఞ ఇప్పుడు మిస్ ఎర్త్ యూనివర్స్ గా పోటీ పడుతున్నది. మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన డాక్టర్ తేజశ్విని మనోఙ్ఞ వృత్తి రీత్యా డాక్టర్. అయితే భరతనాట్యంలో నిష్ణాతురాలు. అదే విధంగా కర్నాటిక్ సంగీతంలో ప్రవేశం ఉంది. యోగా టీచర్ వీటన్నింటితో బాటు క్రీడాకారురాలు, మోటివేషనల్ స్పీకర్ ఇలాంటి ఎన్నో రంగాలలో తన దైన శైలిలో ముందుకు వెళుతున్న డాక్టర్ తేజశ్విని మనోఙ్ఞ ఈ ఏడాది ఫిలిప్పైన్స్ లో జరిగిన మిస్ ఎర్త్ పోటీల్లో భారత్ తరపున విన్నర్ గా నిలిచింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మిస్ ఎర్త్ కు ఎంట్రీలు స్వీకరిస్తున్న తరుణంలో డాక్టర్ తేజశ్విని మనోఙ్ఞ కు మీ ఆశీస్సులు కావాలి. ఈ లింక్ ను ఆసాంతం చూడండి. బెస్ట్ విషెస్ అందచేయండి.
previous post
next post