37.2 C
Hyderabad
March 29, 2024 17: 32 PM
Slider హైదరాబాద్

కె రామకృష్ణ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్

#K Ramakrishna

హైదరాబాద్ వాసవి ఇంజనీరింగ్ కళాశాల లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం లో సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కె రామకృష్ణ కు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ కోసం రాసిన థీసిస్‌ను ఆమోదించి పిహెచ్ డి డిగ్రీ అవార్డు ప్రధానం చేశారు. రామకృష్ణ తన థీసిస్‌లో క్లౌడ్ కంప్యూటింగ్ లో వున్న ప్రస్తుత సమస్యలకు పరిష్కారం చూపారు.

క్లౌడ్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, గ్రిడ్ కంప్యూటింగ్, నెట్‌వర్కింగ్, వర్చువలైజేషన్, సర్వీస్ ఓరియంటేషన్ మరియు మార్కెట్-ఓరియెంటెడ్ కంప్యూటింగ్ పునాదులపై రూపొందించబడిన ఒక కంప్యూటింగ్ నమూనా. క్లౌడ్ వినియోగదారులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య క్లౌడ్‌లో ఉన్న భారీ సమాచారం, దాని భద్రత. మెరుగైన పనితీరు కోసం, క్లౌడ్ కంప్యూటింగ్ వనరులను సమర్ధవంతంగా నిర్వహించాలని వినియోగదారుల నుండి డిమాండ్ ఉన్నది.

క్లౌడ్‌లో సమాచారాన్ని భద్రపరచడానికి నిర్మాణాత్మక భద్రతా ఫ్రేమ్‌వర్క్ ఎంతో అవసరం. అసలైన వినియోగదారులను ప్రామాణీకరించడానికి కావాల్సిన ఫ్రేమ్ వర్క్‌ను, వినియోగదారుడు, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ మధ్య మార్పిడి జరిగే సమాచారాన్ని గోప్యంగా వుంచటం, ఓవర్‌హెడ్‌ను తగ్గించడం ద్వారా క్లౌడ్ వాతావరణాన్ని సురక్షితంగా ఉంచడానికి, సమాచారాన్ని రహస్యంగా ఉంచడం కోసం కె రామకృష్ణ పరిష్కారమార్గం రూపొందిoచి అమలు చేశారు.

వరంగల్ – ఎస్ ఆర్ యూనివర్సిటీ డీన్ డా. సి.వి.గురురావు పర్యవేక్షణలో కె రామ కృష్ణ తన థీసిస్‌ రాశారు. ఈ సందర్బంగా రామ కృష్ణ వాసవి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం కు, ప్రిన్సిపాల్ ఎస్ వి రమణకి, ఐటి విభాగ అధిపతి ప్రొఫెసర్ రామ్మోహన్ కి ధన్యవాదాలు తెలిపారు. వాసవి ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు, స్నేహితులు కె రామ కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

భూ వివాదాలకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

Bhavani

ముందే వచ్చిన దీపావళి సంబంరం

Satyam NEWS

ఇంటర్ సిలబస్ తగ్గింపు పేరుతో చరిత్ర తొలగించడం తగదు

Satyam NEWS

Leave a Comment