వనపర్తిలోని రాయిగడ్డకు చెందిన విలేకరి అయిందాల ఓంకార్ కుమార్తె అయిందాల ప్రశాంతి (సెల్ నంబర్ 9885331332) కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగులో ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డు పొందారు. ఏ మిషన్ లెర్నింగ్ ఫ్రెమ్ వర్క్ అండ్ ఆల్గరీథమ్స్ ఫర్ ఎనోమలి డిటెక్షన్ టూవర్స్ సెక్యూరిటీ అనే అంశంపై సిఎస్ఇ-సిబిఐటి (ఏ) విభాగాధిపతి ఫ్రొఫెసర్ ఆర్. రవీందర్ రెడ్డి మార్గదర్శకత్వంలో పరిశోధన చేసి సిద్ధాంత వ్యాసాన్ని అందజేసినందుకు డాక్టరేట్ లభించింది. అయిందాల ప్రశాంతి హైదరాబాద్ నల్ల నర్సింహా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో అసోసియేట్ ఫ్రొఫెసర్ గా పని చేస్తున్నారు. చదువు నేర్పిన గురువులు స్కాలర్స్ డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ నయనతార, గులాం హుస్సేన్, రాజవర్ధన్ రెడ్డికి ప్రశాంతి కృతజ్ఞతలు తెలిపారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్