28.2 C
Hyderabad
May 24, 2025 09: 11 AM
Slider ఆదిలాబాద్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డాక్టర్ పోస్టుల భర్తీ ప్రకటన

#Siktha Patnayak

ఉమ్మడి ఆదిలాబాద్ (ఆదిలాబాద్, నిర్మల్, మంచేరియల్, కుమరంభీం అసిఫాబాద్ ) జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో పనిచేసేందుకు  20  సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిపై భర్తీ చేసేందుకు  ఈనెల 31న  వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ పోస్టులు ప్రస్తుతం ఒక సంవత్సరం కోసం (అవసరమైతే పెంచుతారు) కాంట్రాక్ట్ పద్దతిలో పని చేసేందుకు నిర్దేశించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 40270 /- రూపాయల జీతంతో పాటు తగు ప్రోత్సాహకాలు ఉంటాయి. ఎంబీబీఎస్ విద్యార్హత కలిగి ఆసక్తి కల అభ్యర్థులు ఈ నెల 31న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరు కావలసిందిగా జిల్లా కలెక్టర్ కోరారు.

అభ్యర్థులు తమతో పాటు ఒరిజినల్  ధ్రువ పత్రాలతో పాటు ఎస్. ఎస్. సి, ఎం. బి .బి .ఎస్., సమీకృత కుల ధృవీకరణ పత్రం ఫోటో కాపీలు, ఇటీవల తీసుకున్న రెండు కలర్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో సహా టీ.ఎస్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తో హాజరు కావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

ఈనెల 27న హైదరాబాదులో నిర్వహించిన  వాక్ ఇన్ ఇంటర్యూ కు హాజరైన డాక్టర్లు 31 న  ఆదిలాబాద్ లో నిర్వహించే  వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరు కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Related posts

ఉత్తమ్ కు రాఖీ కట్టిన ఆయన సోదరి

Satyam NEWS

సైనికుల స్ఫూర్తితో సేవలు

mamatha

విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించండి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!