ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫురుఖాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. కళ్లు తెరిచి లోకం చూడకముందే హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ పసిబిడ్డకళ్లు మూసింది. అప్పుడే పుట్టిన బిడ్డను కుక్క కొరికేయడం తో ఈ దీర్ఘటన చోటుచేసుకుంది.బాధాకరమైన ఈ ఘటన రెండు రోజుల క్రితం ఆకాష్ గంగా హాస్పిటల్‌లో చోటుచేసుకుంది. రవికుమార్ తన భార్య కంచన్ పురిటినొప్పులతో బాధపడుతుండగా ఆమెను సమీపంలోని ఆకాష్ గంగ హాస్పిటల్‌కు తీసుకొచ్చాడు.
నొప్పులు ఎక్కువ అవడంతో ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేసి పండంటి మగబిడ్డపుట్టాడని వైద్యులు తండ్రి రవికుమార్‌తో చెప్పారు. వెంటనే తన బాబు ను చుస్తానన్న, కాసేపు ఆగాల్సిందిగా సిబ్బంది రవికుమార్‌కు చెప్పారు.తల్లిని వార్డ్ లోకి మార్చమని బిడ్డ ఆపరేషన్ థియేటర్‌లోనే ఉన్నట్లు చెప్పారు.అప్పుడే ఆపరేషన్ లోకి ప్రవేశిన ఓ ఊర కుక్క పసిబిడ్డను పీక్కతింటుండాగా ఒప్రెషన్ థియేటర్ కు వెళ్లిన సిబ్బంది ఆహహారాలు చేస్తూ బయటకు వచ్చారు.
ఎదో జరుగుతున్నదని లోపలి వెళ్లి చుసిన తండ్రి రవికుమార్ తమ బిడ్డ రక్తం లో విగత జీవుడై ఉండటం చూసి రోదించగా ఆసుపత్రి సిబ్బనది ఆయనను ఈ విషయం ఎవరికిచెప్పద్దని ఇందుకు నష్టపరిహారంగా డబ్బులు ఇస్తామని చెప్పడం తో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈవిషయమై స్పందించిన కలెక్టర్ ఆ ఆసుపత్రిని సీజ్ చెసి సిబ్బంది చర్యలకు ఆదేశించారు.నవమాసాలు మోసిన ఆ కన్నతల్లి తన బిడ్డను కళ్లారా చూడక ముందే ఈ దారుణం జరిగిందని రోదించడం పలువురిని కలిచి వేసింది.