తెలుగుదేశం పార్టీకి షాక్ లపై షాక్ లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్య వర ప్రసాద్ రాజీనామా చేశారు. టీడీపీ పార్టీ ఎమ్మెల్సీ గా ఉన్న డొక్కా మాణిక్య వర ప్రసాద్ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు. నారా లోకేష్ కు ఒక రకంగా గైడెన్సు కూడా ఇస్తుంటారు.
అంతటి కీలక నేత అయిన డొక్కా మాణిక్య వర ప్రసాద్ రాజీనామా చేయడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లు చర్చకు రాకముందే ఇలా జరగడం తెలుగుదేశం పార్టీకి ఊహించని దెబ్బగా చెప్పవచ్చు.