యువత ఆరోగ్యాన్నిదృష్టిలో పెట్టుకునే కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించిందని ఏపీ రాష్ట్ర తూర్పు కాపు చైర్మన్ పాలవలస యశస్వి అన్నారు. విజయనగరంలో కలెక్టర్ ఆద్వర్యంలో ఇంటర్ కళాశాలలో ఆ పదకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.అనంతరం ఆమె మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలోనే కాక తెలుగు వారంతా ఇష్టపడేనాటి మహిళ డొక్కా సీతమ్మ అని ఆమె పేరుతో కూటమి ప్రభుత్వం మధ్యాహ్నం భోజన పధకాన్ని అమలులోకి తీసుకువచ్చిందన్నారు. విద్యార్ధి ముఖ్యంగా యువత పరిపుష్టిగా ఆరోగ్యంగా ఉంటే దేశానికి మంచిందని ఆమె అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులన్నట్టుగానే నేటి యువతే దేశ భవిష్యత్ కు పునాది అని ఆమె అన్నారు.అనంతరం టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు,సీఎం చంద్రబాబు మదిలో మెలిసిందే ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని అన్నారు.
previous post