28.7 C
Hyderabad
April 20, 2024 10: 14 AM
Slider పశ్చిమగోదావరి

అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది

#Donation of blood

ప్రమాదాల సమయం లో, శస్త్ర చికిత్సలు సమయంలో రక్తం చాలక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. రక్త దానం చేయడంవల్ల పోయే ప్రాణాలు కాపాడ గలుగుతామని గోపన్నపాలెం సీతారామ వ్యాయామ కళాశాల ప్రిన్సిపాల్
డాక్టర్ ఎస్ నతానియెల్ అన్నారు.

శుక్రవారం ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం లోని వ్యాయామ కళాశాల లో లైన్స్ క్లబ్ ఆప్ హేలాపురి, ఇండియన్ రెడ్ క్రాస్, సీతారామ వ్యాయామ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో కళాశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరం లో పలువురు ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు రక్తదానం చేశారు. లైన్స్ క్లబ్ ఆప్ ఏలూరు,

ఇండియన్ రెడ్ క్రాస్ .సీతారామ వ్యాయామ కళాశాలల ప్రతినిధులు విద్యార్థుల ద్వారా సేకరించిన రక్తాన్ని పేదరికంలో ఉంది. రక్త హీనతతోను, తలసేమియా వ్యాధులతోను, రోడ్డు ప్రమాదాలలో రక్తం కోల్పోయిన నిరుపేదలకు, రక్తహీనతకు గురైన గర్భిణీ స్త్రీలకు ఈ రక్తాన్ని అందజేస్తామని ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమం లో రక్త దానం చేసిన

విద్యార్థులను ప్రిన్సిపాల్ నతానియెల్ అభినందించారు. లైన్స్ క్లబ్ తరపున పాల్గొన్న ప్రతినిధులు డి గణేష్ వి బాబు.వెంకటేశ్వరరావు పి ఆదినారాయణ, కణాల శ్రీనివాసరావు, రెడ్ క్రాస్ పి ఆర్ ఓ.శ్రీ రమణ లను కళాశాల ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ నతానియెల్, ప్రసాద్, అధ్యాపకురాలు, శ్యామల ఘనంగా సన్మానించారు.

Related posts

మాణిక్ రావ్ ఠాక్రేతో జానారెడ్డి, పొంగులేటి భేటి

Bhavani

భద్రాద్రి జిల్లాకు మూడో స్థానం

Murali Krishna

పాఠశాలను సందర్శించిన ఎంపిపి గూడెపు శ్రీనివాస్

Satyam NEWS

Leave a Comment