కరోనా వ్యాధి నియంత్రణకు తమ వంతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి నిర్మల్ కు చెందిన డాక్టర్ దేవేందర్ రెడ్డి 1 లక్ష 50వేలు విరాళంగా ఇచ్చారు. అదే విధంగా నిర్మల్ క్రషర్స్ అసోసియేషన్ 2 లక్షలు, నిర్మల్ స్టీల్ ఇత్తడి మర్చంట్ అసోసియేషన్ 1 లక్ష రూపాయల ను విరాళంగా ఈరోజు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి అందజేసారు. నిర్మల్ కు చెందిన ప్రముఖ డాక్టర్ నాళం స్వప్న శశికాంత్ కరోనా వైరస్ వ్యాధి నియంత్రణ, నివారణ చర్యలకు గాను రూ. 1 లక్షల నిధిని సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. శనివారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెక్కును అందుకున్నారు.
previous post