Slider మెదక్

డొనేషన్స్: కరోనా కట్టడికై ముందుకు రండి

Harish Donations

కరోనా విజృంభిస్తున్న వేళ.. కరోనాను ఆరికట్టేందుకు విరాళాల ద్వారా చేతనైన సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు స్వీకరించారు.

మంత్రి హరీశ్ రావు గారి పిలుపు మేరకు సిద్ధిపేటకు చెందిన ప్రముఖ కళింగ బ్రీడ్స్ ఫార్మర్ పరిశ్రమ ప్రతినిధి కే. సురేందర్ రెడ్డి రూ.5 లక్షల రూపాయల  విరాళం అందించినట్లు మంత్రి వెల్లడించారు. అదే విధంగా సిద్ధిపేటకు చెందిన హెచ్ పీ గ్యాస్ డీలర్ మహేశ్ – అప్పు కరోనా నివారణకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి సహకరిస్తూ.., తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1లక్ష రూపాయల విరాళాన్ని అందించారని మంత్రి పేర్కొన్నారు.

వీరిని స్ఫూర్తి దాయకంగా తీసుకుని మరింత పెద్ద మనస్సుతో దాతలు ముందుకొచ్చి తమ వంతు సాయాన్ని అందించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

తెరుచుకున్న శబరిమల ఆలయం

Satyam NEWS

రాజకీయ బిక్ష పెట్టిన రాయచోటి ప్రజలకు ధన్యవాదాలు

Satyam NEWS

మళ్లీ క్షిపణి ప్రయోగం: పెట్రేగిపోయిన ఉత్తర కొరియా

Satyam NEWS

Leave a Comment