30.7 C
Hyderabad
April 19, 2024 10: 54 AM
Slider ప్రత్యేకం

డోసు వ్యవధి తగ్గింపు

dose duration reduction

సీరమ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకా విషయం లో జాతీయ సాంకేతిక సలహాబృందం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని 8-16 వారాలకు తగ్గించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటి వరకు రెండు డోసుల మధ్య వ్యవధి 12-16 వారాలుగా ఉంది. అంటే మొదటి డోసు తీసుకున్న 84 రోజుల తర్వాత తదుపరి డోసు తీసుకునేలా నిబంధనలున్నాయి. ఇప్పుడు ఈ వ్యవధిని 56 రోజులకు తగ్గించనున్నారు.  56 రోజుల తర్వాత తదుపరి డోసు తీసుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో నిరూపితమైన సమాచారాన్ని బట్టి ఎన్టిటిఎజిఐ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా 6 నుండి 7 కోట్ల మంది ప్రజలు రెండో డోసు ను వేగవంతంగా తీసుకునేందుకు వీలుకలుగుతుంది. మరొక స్వదేశీ టీకా సంస్థ భారత్ బయోటెక్ టీకాల వ్యవధిని మాత్రం యదావిధిగా ఉంచింది. కొవాగ్జిన్ మొదటి, రెండవ డోసుకు మధ్య కనీస వ్యవధి ఇప్పుడు 28 రోజులుగా ఉంది.

Related posts

కుర్చీ రాజకీయాలు తప్ప కాంట్రాక్ట్ కార్మికుల్ని పట్టించుకోరా?

Satyam NEWS

కరోనా వ్యాప్తిపై వైసీపీ నేతలు, అధికారుల నిర్లక్ష్యం

Satyam NEWS

నో లా అండ్ ఆర్డర్: రాజంపేటలో బడుగులపై దౌర్జన్య కాండ

Satyam NEWS

Leave a Comment