36.2 C
Hyderabad
April 24, 2024 19: 21 PM
Slider మహబూబ్ నగర్

డబుల్ బెడ్ రూమ్ లు మొదట మాకే కేటాయించాలి

#RavulaChandrasekharaReddy

వనపర్తి పట్టణంలో 1997లో తెలుగుదేశం పార్టీ నాయకుడు రావుల చంద్రశేఖర్రెడ్డి  చిట్యాల శివారులో 312,335 సర్వే నెంబర్ భూమిలో 11ఎకరాలు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయించి పట్టణంలో  పేద బి.సి,ఎస్. సి వర్గాలకు 100గజాల చొప్పున ఇళ్ల స్థలాల కోసం పట్టాలు ఇప్పించారని తెలుగుదేశం పార్టీ నేత నందిమల్ల అశోక్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

వీరందరికి డబుల్ బెడ్ రూంలు కేటయించిన తర్వాత మిగతా వారికి ఇవ్వాలని  కోరారు. అదే విధంగా అప్పాయిపల్లి డబల్ బెడ్ రూమ్ లు వరదలు వస్తే మునిగిపోయే ప్రమాదం ఉందన్నారు.

వాటికి వరద ముంపు నుండి రక్షణ కలిపించాలని డిమాండ్ చేశారు. అదే విధముగా రోడ్ల విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న బాధితులకు డబల్ బెడ్ రూంతో పాటు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

2013లో అప్పటి రాష్ట్ర పురపాలక మంత్రి  అంబేద్కర్ చౌరస్తా నుండి జమ్మి చెట్టు వరకు ఇల్లు కోల్పోతున్న బాధితులకు రావుల విజ్ఞప్తి మేరకు 20కోట్ల రూపాయలు మంజూరు చేశారని, కానీ ప్రభుత్వాలు మారడం వల్ల అది సాధ్యం కాలేదు. కాబట్టి మంత్రి గత జి.ఓ ను దృష్టిలో పెట్టుకుని, మిగతా ప్రాంతాలలో ఇచ్చినట్లుగా బాధితులకు నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.

గతములో ఇచ్చిన హామీ మేరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ నేత డిమాండ్ చేశారు.నాయకులు పోలేపల్లి బాలయ్య, వహీద్, డి.బాలరాజు,టి.ఎన్. టి.యు.సి నాయకులు శంకర్,వెంకట్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

విజయనగరం జిల్లా స్థాయి అధికారుల‌ను ప‌ట్టి పీడిస్తున్న మ‌హ‌మ్మారి

Satyam NEWS

జనవరి 5న ప్రపంచ భారీ ఎలక్ట్రానిక్స్ షో

Sub Editor

గుజరాత్ తుది పోరు!: ఎవరి ఆశ వారిదే

Bhavani

Leave a Comment